ఉన్నాయి ఇక్కడ బొమ్మలు కొన్ని....
ఉన్నాయి ఇక్కడే బొమ్మలు కొన్ని....
జాతీ నీతి లేని రాతి బొమ్మలు కొన్ని...
మానవత్వం మరచిన మట్టి బొమ్మలు కొన్ని....
కీ ఇస్తే ఆడే కీలు బొమ్మలు కొన్ని....
నాణ్యత లేని నాజూకు గాజు బొమ్మలు కొన్ని....
మాటా పలుకు లేని మైనపు బొమ్మలు కొన్ని...
లూటీ చేసే లడాయి బొమ్మలు కొన్ని...
బడా బడా పోకడల బడాయి బొమ్మలు కొన్ని...
మనసే లేని మర బొమ్మలు కొన్ని....
పేద, ధనిక అన్న విభేదాలలో...
కులం, మతమన్న వివాదాలలో...
మలినమైన ఆలోచనలలో పడి
మట్టిపాలవుతున్నవి మనిషి బొమ్మలు కొన్ని....
ఉన్నాయి ఇక్కడ బొమ్మలు కొన్ని....
ఉన్నాయి ఇక్కడే బొమ్మలు కొన్ని....
ఉన్నాయి ఇక్కడే బొమ్మలు కొన్ని....
జాతీ నీతి లేని రాతి బొమ్మలు కొన్ని...
మానవత్వం మరచిన మట్టి బొమ్మలు కొన్ని....
కీ ఇస్తే ఆడే కీలు బొమ్మలు కొన్ని....
నాణ్యత లేని నాజూకు గాజు బొమ్మలు కొన్ని....
మాటా పలుకు లేని మైనపు బొమ్మలు కొన్ని...
లూటీ చేసే లడాయి బొమ్మలు కొన్ని...
బడా బడా పోకడల బడాయి బొమ్మలు కొన్ని...
మనసే లేని మర బొమ్మలు కొన్ని....
పేద, ధనిక అన్న విభేదాలలో...
కులం, మతమన్న వివాదాలలో...
మలినమైన ఆలోచనలలో పడి
మట్టిపాలవుతున్నవి మనిషి బొమ్మలు కొన్ని....
ఉన్నాయి ఇక్కడ బొమ్మలు కొన్ని....
ఉన్నాయి ఇక్కడే బొమ్మలు కొన్ని....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి