కొత్త చీర;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అరే ఏమైంది రా,
అలా ఉన్నావు ఏంటి...
ఎన్నని చెప్పను, ఏమని చెప్పనురా!
మీ చెల్లికి ఈ మధ్య పిచ్చి బాగా ముదిరిపోయింది తెలుసా నీకు...
వానా కాలం అన్నాక వర్షాలు,
పెళ్ళయిన వాడికి కష్టాలు కామనే కానీ...
విషయం ఏంటిరా???
ఫంక్షన్ ఉందండి కొత్త చీర కావాలి అంటూ 
ఉదయం నుంచి రాత్రి వరకు ఒకటే రచ్చ...
అందుకే టార్చర్ తట్టుకోలేక నా ఏటిఎం కార్డును తన చేతికి ఇచ్చా…
షాపింగ్ నుంచి రాగానే మెల్లగా చేతిలో పెట్టింది శారీల బిల్...
తీరా చూస్తే మొత్తం బ్యాంకు బ్యాలెన్స్ అంతా నిల్...
ఆఫర్ లో తక్కువకు కొన్నానండి అంటే వావ్ అన్నాను...
బాగ్ ఓపెన్ చేసి చూసి షాక్ తిన్నాను...
ఏమైందిరా...
మొత్తం ముక్కలు ముక్కలుగా మూడు చీరలు...
ఏంటే ఈ చీరలు ఎలా చిరిగాయి అంటే...
నేనే చింపానండి అంది...
ఎందుకే అంటే...
ఫస్ట్ శారీ బార్డరు బాగుంది,,,
సెకండ్ శారీ పల్లు బాగుంది,,,
థర్డ్ శారీ కలర్ బాగుంది,,,
అందుకే అన్నీ కట్ చేసి ఒక్కశారీగా సెట్ చేశానండి అంది...
మరి మిగతాదంత అంటే... వేస్టే కదా అంటూ 
నవ్వుతూ వెళ్లిపోయింది...
ఆ మాటతో ఒక్కసారిగా నా మైండ్ బ్లాక్ అయిపొయింది...
సరేలే అనుకుని,,,
బంగారం...
ఆఫర్ అన్నవుగా ఒక్కశారీ ఎంత అయింది అని అడిగా....
తెలుసా 20,000 శారీ ని 19.999 కి ఇచ్చారండి ఆఫర్ లో 
అందుకే మూడూ కొనేసానండి అని అంది...
నాకు కొంచెం సేపు మాటలు నోట రాలేదు
ఇంతకి ఎవరిదే ఆ ఫంక్షన్ అంటే మన పక్కింటి 
లక్ష్మి చెల్లెలి గారి అత్త గారి మేనత్త కొడుకు 
కూతురి మనవరాలి 
అక్షరాభ్యాసం అండి అని అనగానే వాళ్ళు 
మనకు తెలియదు కదే…
ఇంతకి ఎప్పుడే అది అంటే
తెలియదండి ఇంకా పిలువలేదు ఒకవేళ పిలిస్తే 
వెళ్ళాలి కదా 
అని కొత్త చీర అడిగాను అనగానే...
ఏం చేయాలో అర్ధంకాక
టెన్త్ ఫెయిల్ అయిన మీ చెల్లి తెలివితేటలను
తట్టుకోలేక ఇదిగో
ప్రశాంతత కోసం ఇలా బయటకు వచ్చానంటూ తన
బాధను పంచుకున్నాడు...


కామెంట్‌లు