టైర్ పంక్చర్;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 బయటకు తీసుకుపొమ్మని తాను గొడవ చేస్తుంటే ఎక్కించుకోక తప్పలేదు నా బైక్కు,
కొంచెం దూరం వెళ్ళాక ఆపుదామంటే పడి చావడంలేదు నా బైకుకి బ్రేకు...
బ్రేకులు పడడం లేదు అనగానే కంగారు పడుతూ తాను మొదట అయింది షాకు…
తర్వాత కొద్ది సేపు తన నాన్  స్టాప్ తిట్లతో నాకు తెప్పించింది క్రాకు...
ఆ తిట్లు వినలేక, లేదు బంగారం నేను ఊరికే చేశానన్నాను జోకు...
కంట్రోల్ ఎంత చేసినా, ఆగని నా బైకు వెళ్ళి ముళ్ళ పొదల్లో అయింది లాకు…
ముందుకు సాగని టైర్ ని చూసే దాక పంక్చర్ అయిందని, అవ్వలేదు నా బ్రెయిన్ కి స్ట్రైకు...
అప్పుడు ఆ సమయంలో...
పైనేమో అదిరిపోతున్న ఎండ...
పక్కనేమో నన్ను భయపెడుతున్న అనకొండ...
నడిరోడ్డు పైన తట్టు కోలేనంత సెగ...
పక్కనేమో నన్ను కోపంతో కమ్ముకుంటున్న పొగ...
తన కోపాన్ని చూస్తే నా ఫొటోకి పడుతుంది అనుకొని దండ…
తనకు తెచ్చియిచ్చాను చల్లచల్లని ఒక తండ....
అప్పుడే తగ్గించడానికి నా స్ట్రెస్సు...
అటు పక్కగా వచ్చింది ఒక బస్సు...
ఇంటికి వెళ్ళాక ఏమైంది అని అనుకుంటున్నారా...??
ఇంకేమై ఉంటుందండీ...
వీపు మీద అట్లు…
రోజంతా తిట్లు...


కామెంట్‌లు