పద్యాలు ; -మమత ఐలకరీంనగర్9247593432
 దత్తపదులు:-
కంట..ఇంట..వంట..తంట
తే.గీ
*కంట* పడినట్టి పండుకై కాలు కదిలి
*ఇంట* నిలవని మనసుతో తుంటరిగను
*వంట* కంబారగింపక పండుతెంప
*తంట* వీపుకు వచ్చెరో దాని తప్పె
దత్తపది:-కంట..ఇంట..వంట..తంట
తే.గీ
కంట నిండిన నీరుచే గనక బురద
ఇంటనే నుండు కప్పగన్ యేమెరుగక
వంటలుద్యోగమిల్లుకై పరితపించ
తంటలెందులకచ్చునొ తప్పెరుగమె

కామెంట్‌లు