పచ్చని చెట్లు రంగుల పూలు
నాలో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి!
ప్రతి ఆకు కదలిక, ప్రతి పువ్వురంగు
నాకు ఓ దారి చూపిస్తున్న అనుభూతి
నడుస్తుంటే కనడిన కొండలు
ఆకాశానికి కబుర్లు చెబుతున్న అనుభూతి!
కనీసం కృషితో కొండెక్కి
ఆకాశంలో మబ్బుతునకతో
ఒక్క కవితా కబురు చెప్పినా చాలు
లోకమంతా వింటుందనే ఆశ!
రంగులు పూసుకున్న సీతాకోక చిలుక
నా మనసులో కవితా రంగుల్ని
నింపుతోంది, ఎగిరే పక్షి నారహదారి
చూపిస్తోంది,
సుదూరం లో ఉన్న
కొండ చేరుకోవాలంటే ఎంత
దూరం నడవాలో తలచుకుంటే
జీవితానికి ఒక అర్థం తెలుస్తోంది!
*********
నా రహదారి;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి