ఆటో పిల్లలం-ఫోటో మల్లెలం;-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్ 94913879.నాగర్ కర్నూల్ జిల్లా.
ఆటో నడిపేటి గట్టి పిల్లలం
ఫోటో తీసేటి చిట్టి మల్లెలం
పయనం బాట పట్టువారలం
వైనం మాట నిలబెట్టు పోరలం!

ఆటోలోనే మేం ఉంటామండి
రూట్ మ్యాప్ చూపిస్తాం లెండి
అదరక బెదరక మీరెక్కేయ్యండి
ఎక్కారంటే మాకిక లక్కే నండి !

ఆటోనే మాకు భుక్తి ముక్తి
ఆటో పయనం పైనే ఆసక్తి
బాటసారులే మా దేవుళ్ళు
వారి వల్లే డబ్బు వసూళ్ళు !

డీజిల్ పోసి నడుపుతాం మా ఆటో
విజిలేసి పిలుస్తాం మేము ఇక డిటో
వచ్చి దబ్బున ఎక్కిస్తారులే జనం
వారిచ్చిన డబ్బులే మాకిక ఇంధనం 

డబ్బులన్నీ జేబులోని పెట్టుకొని
దబ్బున మా ఇంటి బాట పట్టుకొని
మా ఆటోలో అయ్యాము పయనం
మా కోటలోన చేరుటకు మేం వైనం!

మేమంతా తలచింది ఒకటి
విధి తలచిందేమో మరొకటి
దారిలో జరిగెనుగా  ప్రమాదం
గోదారిలో ఒరిగెనుగా ప్రమోదం!

ప్రమాద దృశ్యాల ఫోటోలుగా తీసి
మా వినతి పత్రంలో మేం జత చేసి
భీమా కంపెనికి మేం పంపామండి
ధీమాగా నష్టపరిహారం పొందామండి !

కల్తీ డీజిల్ తో జరిగే ఈ దారుణం
తేల్చి చెప్పానుగా రిపోర్టు కారణం
ధోషి ఏమో ఇక సేఫ్ గానే ఉన్నాడు
నిర్దోషి ఏమో ముప్పెదుర్కున్నాడు !


కామెంట్‌లు