డాక్టర్ గణపతిరాజు అచ్యుత రామరాజు గారు చక్కటి నటుడు, రచయిత. విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు జీవం పోసింది వారే. అక్కడ అనేక మంది శిష్య ప్రశిష్యులను తయారుచేసి తాను వ్రాసిన నాటకాలతో పాటు పెద్దలు రాసిన నాటకాలను కూడా వేయించి, మంచి పేరు తెచ్చుకున్నారు. సౌమ్య మనస్తత్వం కలిగినవాడు. అందరి తోనూ ఆప్యాయంగా ఉంటాడు. ఆకాశవాణిలో అనేక ఏకపాత్రాభినయాలు, చర్చలు, గోష్ఠిలలో పాల్గొన్నవారు. విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాలలో నాటక పరిషత్తు జరిగితే దానికి న్యాయనిర్ణేతగా వారు వ్యవహరించేవారు. కొన్ని సందర్భాలలో నన్ను కూడా తీసుకొని వెళ్ళాడు. వారి దగ్గర అనేక విషయాలు నాటకంలో మంచి చెడులను నిర్ణయించే పద్ధతులను తెలుసుకున్నాను. మా ఇద్దరి నిర్ణయం ఒకటి అర మార్కుల భేదంతో ఉండేది చెప్పే పద్ధతిలో కూడా సామాన్య విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఎలా బోధ చేస్తాడో అలా చాలా సున్నితంగా నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పేవారు. వారి మాటల్లో వారి జీవితాన్ని వీడియో రికార్డు చేశాను మూడు గంటల నిడివి. వారికి ఆప్తులైన మా గురువుగారు డాక్టర్ వెంకట రాజు గారిని కూడా తీసుకెళ్లి మరో మూడు గంటలు రికార్డ్ చేశాను.
రికార్డింగ్ మొత్తం చేసిన సమయంలో నా ఆత్మీయ స్నేహితుడు మా కేంద్రంలో ఉద్యోగి చంద్రశేఖర్ కూడా వచ్చి ఆసాంతం విని అభినందనలు కూడా తెలిపాడు. ఆ ఛాయ చిత్రం.
రికార్డింగ్ మొత్తం చేసిన సమయంలో నా ఆత్మీయ స్నేహితుడు మా కేంద్రంలో ఉద్యోగి చంద్రశేఖర్ కూడా వచ్చి ఆసాంతం విని అభినందనలు కూడా తెలిపాడు. ఆ ఛాయ చిత్రం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి