స్వాతంత్య్ర రారాజు ⚜️"శంకర ప్రియ." శీల.,సంచారవాణి: 99127 67098
 👌స్వాతంత్య్రరారాజు
     సీతా రామ రాజు
    తెలుగు వీరుడు, రాజు
          ఓ తెలుగు బాల!
    ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌స్వాతంత్య్రమహా సంగ్రామములో, విప్లవశంఖం పూరించిన యోధుడు.. అల్లూరి సీతా రామరాజు! జాతీయోద్యమ నాయకు లందరికి.. స్ఫూర్తిప్రదాత! కనుక, "రా రాజు" యైనాడు .. మన "తెలుగు వీరుడు"!
👌"ఎవడు వాడు? ఎచటి వాడు? ఇచటకు వచ్చిన తెల్లవాడు?" అని, గద్దిస్తూ; విదేశీయుల అరాచక పరిపాలనకు ఎదురు నిలిచాడు! కొండల్లో కోనల్లో.. దేశమాత స్వేచ్చకోరి, తిరుగుబాటు చేసాడు, నిష్కళంక దేశభక్తుడైన.. మన సీతా రామరాజు!
👌సమస్య: పూరణ:
     ( "కప్పలు సర్పముల జంపెఁ గద! వెంకప్పా!" అనే సమస్యకు; పూరించిన చారిత్రక నేపథ్యం!)
       బ్రిటిష్ వారి ప్రతినిధి.. రూథర్ పర్డ్.. స్వాతంత్ర్య సమర వీరుడు, అల్లూరి సీతా రామరాజు వద్దకు; కుతంత్రముతో ఇద్దరు దొరలను పంపించాడు! అది గమనించిన, సీతా రామ రాజు; వారిని బాణములతో.. వధించిన సంగతి తెలుసు కొన్నప్పుడు ;
రూధర్ ఫర్డ్..  వెంకప్ప అనే ద్విభాషితో.. ఇలా ఆశ్చర్యముగా పలికాడు! ఆ విధముగా, తెల్లవారిని  గడగడ లాడించాడు, "విప్లవ జ్యోతి" మన తెలుగు వీరుడు!
   ⚜️ కంద పద్యము ⚜️
      ఒప్పను నేనిది రాజున
     కెప్పట్టున సాధ్య మయ్యె, నిర్వురు దొరలన్
     జప్పున జంపగ శరముల? 
     కప్పలు.. సర్పముల జంపెఁ గద! వెంకప్పా!
    ( ప్రముఖకవి, "శ్రీ జంధ్యాల జయశంకర బాపూజీ" గారు పూరించిన పద్యము)
   🙏వందే మాతరం! వందే మాతరం!🙏

కామెంట్‌లు