అమృత మహోత్సవము"శంకరప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 🙏మనభారత జాతికి
నూత నోత్తేజమ్ము!
   అమృత మహాత్సవమ్ము!  
 ఆత్మ బంధువు లార!
         (ఆత్మబంధు పదాలు., శంకర ప్రియ.,)
👌ఎందరెందరో   మహానుభావుల త్యాగ ఫలము.. ఆగష్టు,15.వతేదీ, స్వాతంత్ర్య దినోత్సవము! నేటికీ 75 సంవత్సరములు పూర్తయిన సందర్భముగా.. అందరం కలిసి; "అమృత మహోత్సవము"ను, వైభవంగా జరుపుకుందాం! రండి!
👌"ఆజాదీకా అమృత మహోత్సవం" శుభ సందర్భములో, మనమంతా.. ప్రతీ ఇంటా మన "జాతీయ జెండాను" ఎగుర వేద్దాం!
   మనదేశము సరిహద్దులను, సంరక్షించుచున్న "జవానులకు"; శాంతి భద్రతలు కలిగించుచున్న "రక్షక భటులకు"; మనకందరికీ.. అన్నము, వస్త్రము.. మున్నగు వాటిని సమకూర్చు చున్న "అన్నదాతలకు".. హృదయ పూర్వకము లైన కృతజ్ఞతాభి వందనములను వ్యక్త పర్చుద్దాం! 
🙏మన "స్వాతంత్ర్య సమర యోధులకు', "దేశభక్తు లందరికి".. శ్రద్ధా భక్తులతో.. జోహారు లర్పించు దాం!
   విశ్వ విఖ్యాత మైన, "మన సనాతన భారతీయ ధర్మము యొక్కమహోన్నత వైభవమును".. ఈ జగతి కంతకూ చాటి చెప్పుదాం! 
  అట్లే, మన సోదరీ సోదరు లందరిలో... "సమతా మమతా భావాలను" పెంపొందించుదాం!
👌అమృత మహోత్సవం.. భారతీయు లందరిలో ప్రవహించుచున్న.. ఒక "మహా స్రవంతి"! కనుక, మనమంతా జాతీయ సమైక్యత భావంతో, ఆనందోత్సాహము లతో, కలిసి మెలిసి జీవించుదాం! మన దేశము యొక్క సర్వతో ముఖాభివృద్ధికి, యథాశక్తిగా.. చేయూతను అందించుదాం!
      ⚜️కవిత⚜️
      అమృతం ఊరుతోంది!
  అలనాటి త్యాగధనులను తలచుకొని
 అఖిలజాతి పులకిస్తుంటే..  
   అమృతం ఊరుతోంది!
    భరతమాత దాస్య శృంఖలాలను
పటాపంచెలు చేసిన
వీరకృత్యాలను తలచుకుంటే..
  అమృతం ఊరుతోంది!
   ఊరూరా ఉత్తేజం పారుతోంది! 
ఏడు పదులకు దాటి వాడవాడలా
 చైతక్య వీణలను మీటి,
స్వతంత్ర భారతం
ప్రపంచంలో అగ్రగామి అవుతుంటే..
   అమృతం ఊరుతోంది! 
ఆనందాల నది పారుతోంది!
      ( డా. అయాచితం నటేశ్వర శర్మ.,)
👌వందే మాతరం! వందే మాతరం!💐

కామెంట్‌లు