సత్సంగ జీవనము; -" శంకర ప్రియ.,"శీల.,సంచారవాణి: 99127 67098
 🙏 సత్సంగ జీవనము
కలిగియుండా లెపుడు
       సాధకులు, భూసురులు
ఆత్మ బంధువు లార!
    (ఆత్మ బంధు పదాలు., శంకరప్రియ)
👌"సజ్జనులు"అనగా సమాజ శ్రేయస్సును,  ఆకాంక్షించువారు! అట్టి వారితో సాంగత్యము పెంపొందించు కోవాలి! అందరితో.. కలిసి, మెలసి, సహజీవనం చేయాలి!  భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గములను అనుసరించాలి! త్రికరణముల శుద్ధిగా పరమేశ్వరుని సేవించాలి! అదియే.. సత్సంగ జీవనము!
👌"భూసురులు అంటే, భూమండల మందు నడయాడు దైవములు! నిత్యము కర్మలను ఆచరించు సాధకులు! ఆగమ, నిగమ, శాస్త్ర పరిజ్ఞానము, మరియు భౌతిక విజ్ఞానము కలవారు! వారే.. మన గ్రామమము లందు, పురము లందు నివసించు ప్రజలందరి యొక్క హితమును.. కోరుతారు!
  👌ఆధ్యాత్మిక సాధకులు.. అందరికి  మార్గదర్శకులుగా; ధర్మబద్ధంగా జీవించాలి! వారు.. మంచి అలవాటులను పాటించాలి! అట్లే చెడు అలవాటులైన.. మద్యపానం, మాంసాహారం.. నాస్తిక భావం.. మున్నగు వాటిని, విడిచి పెట్టాలి! ఆ దుర్వ్యసనములకు..  సాధ్యమైనంత వరకు, దూరంగా ఉండాలి! అట్లే, ధార్మిక, నైతిక విలువలతో.. జీవన యాత్ర కొనసాగించాలి!
   🚩చంపక మాల
      అనయంబున్ హరిపాదపద్మ భజనం, బాధ్యాత్మికంబైన చిం
       తనమున్, ధర్మ నిబద్ధ వర్తనములన్, ధన్యంపు సత్సంగ జీ
  
         వనమున్ గల్గిన సాధు వర్తనులకున్; వర్జ్యంబులౌ నంచుఁ బే
        ర్కొను మో భూసుర!  మద్య మాంసముల సంకోచమ్ము లేకుండగన్!
        ( "సమస్యాపూర్ణ చక్రవర్తి" శ్రీ కంది శంకరయ్య.,)

కామెంట్‌లు
కంది శంకరయ్య చెప్పారు…
చక్కని వివరణ. ధన్యవాదాలండీ!