గొప్ప మనసు ;-యు నిహారిక 9th "E"9848824085;-కే తేజస్విని 9th "E"9292903048జడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్ సిద్దిపేట
 ఒక ఊరిలో జానకిరాములకు ఒక కూతురు, కొడుకు ఉండేవారు. కూతురు పేరు ఖుషి. కొడుకు పేరు అభి. ఖుషి పేరుకు వ్యతిరేకంగా ఉండేది. వాళ్ళ అమ్మ ఆమెను చాలా ఇబ్బందులు పెట్టేది. ఎందుకంటే ఖుషి తన సవతి కూతురు కాబట్టి. ఎప్పుడూ తనను ఏడిపించాలనుకునేది. ఒకరోజు తన కొడుకును జానకి పెద్ద స్కూల్లో చేర్పించింది. ఖుషి ని మాత్రం వీధి చివర ఉన్న ప్రభుత్వం స్కూల్లో చేర్పించింది. ఇదంతా చూస్తున్న వాళ్ల నాన్న ఏమి చేయలేకపోయాడు. ఒకరోజు ఖుషి బడికి వెళ్లడానికి తయారవుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ "దీనిని ఏ విధంగానైనా బడికి వెళ్లకుండా ఆపాలనుకుంది. ఖుషి ఇంట్లో నుండి వెళ్తుంటే జానకి కాలు అడ్డం పెట్టింది. అప్పుడు ఖుషి కింద పడిపోయింది. తన కాలికి గాయం అయింది అయినా గాని తాను కుంటుకుంటూ బడికి వెళ్ళింది. అది చూసిన వాళ్ళ స్నేహితులు అడిగారు. ఏమైంది ఎందుకు కుంటుతున్నావు ఖుషి అని అడిగారు. అప్పుడు ఖుషి కాలు జారీ కింద పడ్డాను అని చెప్పింది. పక్కనే ఉన్న జానకి ఇదంతా వింటుంది. తనలో తాను చాలా కుమిలిపోతుంది ఎందుకంటే తన వల్లనే ఖుషి కింద పడింది అని తనకు  కూడా తెలుసు. అయినా కానీ తను తన తల్లి పరువు పోకూడదు అని వాళ్ళ స్నేహితులకు అబద్ధం చెప్పింది. ఆ తర్వాత నుంచి జానకి అభి ఖుషిలను ఒకే విధంగా చూసింది. ఖుషి చాలా  సంతోషంగా ఉంది.
నీతి: అందర్నీ సమానంగా చూడాలి అది సొంతమైన సవతి అమ్మ అయినా పిల్లలది చాలా సున్నితమైన మనసు దానిని నొప్పించకూడదు.

కామెంట్‌లు