సునంద భాషితం;- వురిమళ్ల సునంద ఖమ్మం
 
జీవనం.... పావనం
    ******
మనం పూరి గుడిసెలో పుట్టామా,ఏడంతస్తుల మేడలో పుట్టామా అన్నది కాదు ముఖ్యం.
మన గమనం,మన ప్రవర్తన,గడిపే సమయం,  నడిచే దారి.. మొత్తంగా మన జీవనం  ఎంత వరకు సార్థకం చేసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం.
ఆలోచనల గమనం సరైన మార్గంలో ఉండాలి.
ప్రవర్తన ప్రశంసించే విధంగా కనబడాలి.గడిపే సమయం  వృధా కాకుండా ప్రయోజనకరంగా గడపగలగాలి.
నడిచే దారి నలుగురికి ఆదర్శంగా ,నీతి నిజాయితీ, మంచితనం ఇమిడి ఉండాలి.
అప్పుడే  మహోన్నత మానవ జన్మ సార్థకం అవుతుంది.
జీవనం పావనం  చేసుకోవాలంటే  ముందుగా మన జీవన పరమార్థం ఏమిటో,సకల జీవుల్లో ఉత్కృష్టమైన మానవ జీవనం  ఎలా ఉండాలో తెలియాలి.
 మనకంటూ ఉన్న ప్రత్యేకమైన , ప్రశంసనీయమైన, ఆమోదయోగ్యమైన అలవాట్లు, అభిరుచులే మన జీవితాన్ని అద్దంలా చూపి  జీవనమో,పావనమో తెలుపుతాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు