దుర్గుణాలు(ఆధ్యాత్మిక కధ) : సి.హెచ్.ప్రతాప్

కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం అనే ఆరు దుర్గుణాలను అరిషడ్వర్గాలని అంటారు. ఇవి ఎంతో ప్రమాదకరం. ఇక వీటితో అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వంటివి కలిస్తే ఎంత ప్రమాదకరంగా మారి సత్పురుషులను సైతం అధ:మ పాతాళానికి దిగజార్చేస్తాయి. ఈ అంశానికి సోదాహరణంగా నిలిచే ఒక కధ దేవీ భాగవతంలో వుంది.
విశ్వామిత్రుడు ఒకనాడు వశిష్టుని దర్శించడానికి అతని ఆశ్రమానికి వెళ్ళాడు. గొప్ప తప సంపన్నుడైన విశ్వామిత్రుడికి సమస్త రాజోపచారాలు చేసి గౌరవించడమే కాదు అతని సమస్త పరివారానికి తన నందిని ధేనువు అనే ఆవు సహాయంతో భక్ష్య,భోజ్యాలతో గొప్ప విందును సమకూర్చాడు. ఒక్క నిమిషంలో తయారైన ఆ పిండి వంటకాలకు  విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. అంతటితో అతనికి దుర్బుద్ధి పుట్టి భోజనం అయ్యాక వశిష్టునికి నమస్కరించి ఒక క్షణంలో కోరిన వాటన్నింటినీ సృష్టించే ఈ గోవు పట్ల నాకెంతో ప్రీతి కలిగింది. ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే నీలాంటి మునిపుంగవుడు కంటే మహారాజైన నా వద్ద ఇది ఉంటేనే బాగుంటుంది కాబట్టి దీనిని నాకివ్వమని ఆర్ధించాడు. అయితే ఆ అభ్యర్ధనను వశిష్టుడు సున్నితంగా తిరస్కరించాడు.దీని పాలు హోమానికి ఎంతో అవసరం కాబట్టి ఇవ్వడం కుదరదని ఖచ్చితంగా చెప్పేసాడు. అందుకు బదులుగా ఈ దేశానికి మహారాజును నేనే కాబట్టి నా ఆజ్ఞ ను శిరసా వహించాల్సిందేనని విశ్వామిత్రుడు పట్టు పట్టాడు.
అంతటితో ఇద్దరికీ మాటకు మాట పెరిగింది. విశ్వామిత్రుని సైన్యం ఆ నందిని ధేనువును బలవంతంగా తీసుకు పోయే ప్రయత్నం చేసారు.


ఆ గోవు తనను రక్షించమని వశిష్టుని దీనంగా ప్రార్ధిస్తే విశ్వామిత్రుని సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి తనకు లేనందున నిన్ను నీవే రక్షించుకోవాలని వశిష్టుడు సూచించాడు.

అప్పుడు కోపంతో ఆ నందినీ ధేనువు హూం అని హుంకరించింది. దాని శరీరం నుండి వేలాది రాక్షసులు పుట్టుకొచ్చి విశ్వామిత్రుని సేనలతో భీకర యుద్ధం చేసారు. 


చివరకు విశ్వామిత్రుని సేనలు అంతమై పోయాయి. వశిష్టుని  తపశక్తికి విశ్వామిత్రుడు నోరెళ్ళబెట్టి చివరకు ఓటమి అంగీకరించి వశిష్టునికి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయాడు. కాని అతనిలో అవమానాగ్ని చల్లారలేదు.తీవ్ర తపస్సు చేసి వశిష్టుని కంటే గొప్ప తపసంపన్నుడు అయ్యి తిరిగి యుద్ధానికి రావాలని సంకల్పించుకొని తపోవనాలకు వెళ్ళిపోయాడు. మరొక పక్క నిత్యం వేదాధ్యయనం, యజ్ఞ  యాగాదులతో ఎంతో పవిత్రం గా వుండే వశిష్టుని ఆశ్రమ ప్రాంగణం రక్తపుటేరులతో, శవాల గుట్టలతో అపవిత్రం అయిపోయింది. అక్కడ పూర్వపు ఆధ్యాత్మిక పవిత్రతను పునరుద్ధరించేందుకు వశిష్టుడు తిరిగి వందలాది సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చింది.

అరిషడ్వర్గాలు తపోధనులను సైతం అధమ పాతాళానికి దిగజార్చేస్తుంండనడానికి ఈ కధ ఒక చక్కని ఉదాహరణ.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం