పరోపకారం ఇదం శరీరం; -: సి.హెచ్.ప్రతాప్
 ఒక ఊరిలో ఒక బిచ్చగాడు నివసిస్తుండేవాడు. పొద్దస్తమానం ఆ ఊరి వీధుల్లో తిరుగుతూ , దేవాలయాల దగ్గర నిలబడి అడుక్కుతింటూ పొట్ట పోషించుకుంటుండేవాడు. వాడి భార్యకు ఈ జీవితం నచ్చక పిల్లల్ని తీసుకొని చాలా కాలం కిందనే ఎటో వెళ్ళిపోయింది. వాడి నివాసం ఊరి చివర వున్న ఒక ఖాళీ స్థలంలో వేసుకున్న పూరిపాకలో.
రాను రాను భిక్షాటన భరించరానిదిగా వాడికి తయారయ్యింది. తాను ఏ జన్మలో ఏ పాపం చేసాడో, ఈ జన్మలో బిచ్చం ఎత్తుకొని బతకాల్సి వస్తొంది. ఉదయం లేచింది మొదలు ఇష్టంగా దానం చేసే వాళ్ళు బహు తక్కువ. అధిక శాతం తిట్టుకుంటూ, చీదరించుకుంటూ , శాపనార్థాలు పెడుతూ బిచ్చం వేస్తుంటారు. ఎప్పటికి ఈ జన్మ మారుతుందా అని అనుకుంటూ వుంటాడు.


ఒకసారి ఆ ఊరి రామాలయంలో ఒక తపసంపన్నుదైన సాధువు వచ్చారని, ప్రజల సమస్యలకు తన తప శక్తితో సూచనలు ఇవ్వడం లేదా వాటిని సత్వరమే పరిష్కరించడం చేస్తున్నారని విన్నాడు.
 ఆ సాధువు వేంచేసిన రామాలయానికి ఒక రోజు ఆ బిచ్చగాడు వెళ్ళాడు. ఎందరో ప్రజలు నిరాశ నిస్పృహలతో, దుఖంతో, కోపంతో,ఆవేశంతో ఆ సాధువుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఆ సాధువు ఏం మంత్రం వేస్తున్నారోగాని, వారందరూ తమ సమస్యలను మర్చిపోయి, ఆనందంగా అక్కడి నుండి తిరిగి వెళ్లడం ఆ బిచ్చగాడు కళ్ళారా చూశాడు. 
ఆ సాధువు ప్రజలకు ఏ మాయ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. కొండంత దుఖంతో వెళుతున్నవారు అంతే ఆనందంగా తిరిగి వస్తున్నారు.వాళ్ల చేతిలో డబ్బు లేక బంగారం లేక వెండి లేదా ఇతర విలువైన వస్తువులు లేవు. కాని ఆనందంగా ఎలా తిరిగీ రాగలుగుతున్నారు ? ఇవన్నీ ఆలోచించి, బిచ్చగాడు కూడా సాధువు  వద్దకు వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడాలని అనుకున్నాడు. తన లాంటి దుఃఖ: పీడితులైన వ్యక్తులకు కూడా ఆ సాధువు నుండి ఉపశమనం లభిస్తుందా అన్న విషయాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు.
సాధువు ని కలవడానికి నడిచాడు. సాధువు ఉన్న చోట చాలా పొడవైన వరుస ఉంది, కాబట్టి బిచ్చగాడు కూడా వరుసలో వచ్చాడు. తన వంతు కోసం వరుస లో నిరీక్షించడం మొదలుపెట్టాడు. అతని వంతు వచ్చి సాధువు దగ్గరికి చేరుకున్నాడు.
అతను సాధువు తో ఇలా అన్నాడు, “మహాశయా ,నేను చాలా పేదవాడిని నాదనుకునే ఒక్క వస్తువు నా దగ్గర ఒక్కటి కూడా లేదు.. నా జీవితాన్ని నడపడానికి కూడా నేను ఇతరులను  అడ్డుకోవాలి, ఫలితంగా వారి నుండి ఎన్నో చీదరింపులు, ఛీత్కారాలు ఎదుర్కోవలసి వస్తొంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేను నా జీవితాన్ని ఎలా  మెరుగ్గా జీవించగలను ?”
అతని మాటలు విన్న ఆ సాధువు శాంత స్వరంతో " నువ్వు పేదవాడివి అనుకుంటున్నావు. నిజానికి నువ్వు పేదవాడివి అసలేమాత్రం కాదు.నువ్వు ఈ రోజు వరకు నీ కోసమే బ్రతికావు, ఎవరికీ చీమ తలకాయంత ఉపకారం కూడా చేయలేదు కాబట్టే నీ మనస్సులో పేదవాడివన్న భావనలు తలెత్తుతున్నాయి" అన్నారు.
ఆ మాటలు బిచ్చగాడి లో ఆశ్చర్యం కలిగించాయి." మహత్మా !, అనుక్షణం నా కడుపు నింపుకోవడం కోసం ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్న నేను ఇతరులకు ఎలా సాయం చేయగలను ? ఇతరుల ఎంగిలి మెతుకులపై ఆధారపడే నాకు ఇదంతా సాధ్యమేనా? " అని అడిగాడు.
ఇదంతా విన్న సాధువు కాసేపు మౌనం వహించి అతనితో ఇలా అన్నా రు , “నీవు ప్రజలకు సేవ మరియు మేలు చేయగలిగినంత చెయవచ్చు.  నీ నోటి ద్వారా ఇతరులకు మంచి మాటలు మరియు దుఖంలో వున్నవారికి స్వాంతన కలిగించే మాటలు చెప్పవచ్చు.. ఇవన్నీ చేయడం ద్వారా మీరు ఇతరులకు సహాయం చేయవచ్చు. కేవలం డబ్బుతో మాత్రమే విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే విద్యను కూడా దానం చేయవచ్చు. భగవంతుడు ఎవరికైనా సంపూర్ణమైన మంచి శరీరాన్ని ఇచ్చినట్లయితే, అతడు పేదవాడు కాదు. అతను కేవలం మనస్సులో పేదవాడు. ఈ ఆలోచనను వీడి ఇతరులకు సేవ చేయాలి కష్టంలో వున్నవారికి చేతనైనంత శ్రమదానం చెయ్యవచ్చు. నీకు వచ్చే అన్నంలో కొంత భాగం నోరు లేని జీవాలకు పెట్టవచ్చు. ఇలా ఇతరులకు మన పరిధిలో వ్లైనంత సహాయం చేయవచ్చు. ఇతరులకు చేసిన మేలు వెయ్యింతలై మన దగ్గరకే వస్తుంది. మనమందరం పేదలమని చింతిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటాము కానీ ఇది నిజం కాదు. నిజం ఏమిటంటే, మన శరీరం పూర్తిగా మెరుగ్గా ఉండి మనకు సహకరిస్తున్నంత కాలం మనం  జీవితంలో ముందుకు సాగడానికి మరియు మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాలి.. ఒక వ్యక్తి తన పేదరికం పై శ్రద్ధ చూపి, దానిని మార్చడానికి ప్రయత్నించకపోతే అతను మూర్ఖుడు నువ్వు నీ శ్రామిక సక్తిని ఏనాడూ నమ్ముకోలేదు. భిక్షాటన వదిలి కాయకష్టం చేసుకుంటే ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. ఈ దిశగా ఆలోచించి కొత్త జీవితం ప్రారంభించు" అని హితబోధ చేసాడు.
ఆ సాధువు మాటలు బిచ్చగాడిలో జ్ఞానోదయం కలిగించాయి. ఆ రోజు నుండే భిక్షాటన వదిలి కాయకష్టం చేసుకుని జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సాధువును దర్శిస్తున్న ఇతరుల లాగే ఆ బిచ్చగాడి జీవితంలో కూడా ఆ రోజు నుండి పెను మార్పు వచ్చింది.
 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం