మంత్రి హరీష్ రావు గారితో నాన కవికి సన్మానం:

 తెలంగాణ సాహిత్య కళా పీఠం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సిద్దిపేటలోని మంత్రి తన్నీరు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన ప్రజాకవి కాళోజీ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవవం & అక్షర శిల్పం కవితా సంకలనం ఆవిష్కరణ కార్యక్రమంలో నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన కవి,రచయిత, ఆరోగ్య పర్యవేక్షకులు నాశబోయిన నరసింహ(నాన)  ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం యొక్క విశిష్టతను తెల్పుతూ తాను రాసిన కవిత్వం "అక్షర శిల్పం" కవితా సంకలనంలో చోటు చేసుకున్నందుకు అభినందిస్తూ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా మరియు ప్రముఖ సాహితీ వేత్త,ఆం.ప్ర.జానపద అకాడమీ ఛైర్మన్ పొట్లూరి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య కళాపీఠం అధ్యక్షురాలు శ్రీమతి దాసరి శాంతాకుమారి, ప్రధాన కార్యదర్శి గంగపురం శ్రీనివాస్,సినీ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్, మౌనశ్రీ మల్లిక్ తదితరులు నాశబోయిన నరసింహ (నాన)ని ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు