డాక్టర్ శామ్యూల్ జాన్సన్!..అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆంగ్లంలో తొలి డిక్షనరీ తయారు చేసిన  డాక్టర్ శామ్యూల్ జాన్సన్ అకారాది క్రమంలో అర్ధం బదులుగా వాటి పరిభాష రాయటం విశేషం.సిగరెట్ అర్ధం ఇలా రాశాడు.. కాగితం తో చుట్టిన పొగాకు. దాని ఒకవైపు నించి పొగ వస్తుంది. రెండోవైపు ఒక బేవకూఫ్ నోటిలో ఉంటుంది. 
జాన్సన్ కి రకరకాల వెరైటీగా వంటకాలు విభిన్న రుచుల పానీయాలంటే మహా ప్రీతి!దోసకాయ అంటే వెగటు.ఆవిషయం అందరు స్నేహితులకు తెలుసు. ఒక మిత్రుడు అతన్ని ఏడ్పించాలని"మిష్టర్ జాన్సన్! మీ ఉద్దేశం లో దోసకాయను ఎలా తినొచ్చో చెప్పండి "అని అడిగాడు. జాన్సన్ కి  అతని వ్యంగ్యం అర్ధం ఐంది.కానీ పైకి తన భావాన్ని  వ్యక్తపర్చకుండా"నా లెక్క ప్రకారం దోసకాయని బాగా శుభ్రంగా కడిగి తుడిచి  చెక్కుతీసి చిన్నగా ఒకేసైజులో ఉండేలా ముక్కలు చేసి అందమైన ప్లేటులో పెట్టి ఉప్పు మిరియాలపొడి చల్లి ఆ సలాడ్ని .." "ఊ!ఇంక నోట్లో వేసుకుని కరకర నమిలి తింటమేకదా?" ప్రశ్నించాడు మిత్రుడు. జాన్సన్  అన్నాడు "కాదు.ఇలా కిటికీ లోంచి బైటకి గిరాటేయాలి.దోసకాయ తినే వస్తువా?నీలాంటి వాడికి
 అలాంటి చెత్త తింటం అలవాటు!" అంటూనే  ఆప్లేటుని కిటికీలోంచి
 విసిరేశాడు.నోరూరించే ఆపదార్ధం ని జాన్సన్ బైటకి విసిరేప్పటికి మిత్రుడిమొహం పాలిపోయింది.🌹
కామెంట్‌లు