తాత రోజూ గుడికి వెళ్లేప్పుడు రోజుకొక వస్తువు తీసుకుని వెళ్తాడు.ఒకరోజు బిస్కెట్టు పాకెట్ పులిహోర పొట్లాలు పళ్ళు..ఇలా తనకు అందుబాటులో ఉన్నవి తీసుకుని వెళ్తాడు.ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో ఉన్నాడు."నాన్నా! ఇక్కడే ఉండు.నాకు గ్రీన్ కార్డ్ ఉంది కదా?మనవలతో కాలక్షేపం అవుతుంది " అని ఎంతో చెప్పాడు."నాకు తోచదురా!" అని భార్య పోవటంతో ఇల్లు అమ్మి బ్యాంక్ లో వేశాడు తాత. తన స్నేహితుడు పెట్టిన ఓల్డ్ఏజ్ హోంలో చేరి అక్కడ ఉన్న వారికి తగిన సాయం చేస్తాడు. తోటపని భజనలు పాడటం సీనియర్ సిటిజెన్స్ చేత రేడియో ప్రోగ్రాంలు ఇప్పించటం చేస్తాడు.దగ్గర ఉన్న గుడికి వెళ్లి వస్తూ దివ్యాంగులకి తినుబండారాలు అందిస్తాడు.ఓరోజు ఆయన పేపర్లోని ఓకథని చదివివినిపించాడు.ఒకప్పుడు పారిస్ లో ఓస్త్రీ రాత్రి పూట చలిలో పడుకున్నవారికి దుప్పట్లు తన దగ్గర ఉన్నవి కప్పి వస్తోంది. పైగా తలవంచుకుని గబగబా నడిచి ఇంట్లో కి పోతుండగా పొరుగామె అడిగింది"ఎందుకు అమ్మా! తలొంచుకుని నడుస్తావు?" దానికి ఆమె ఇచ్చిన జవాబు ఇది"దేవుడు తన వేలాది చేతుల్తో నాకు ఎన్నో ఇచ్చాడు ఇస్తున్నాడు.కానీ నేను మాత్రం కేవలం నాకుడిచేత్తో నాదగ్గర ఉన్న దుప్పట్లు కప్పి వస్తున్నాను.అందుకే సిగ్గుపడుతూ తలొంచుకుని నడిచి వస్తున్నాను."చేయూత అంటే మనకి ఉన్నంతలో చేతనైనన్ని మంచి పని చేయాలి. డబ్బు ఇవ్వాలని లేదు. ఒంటరిగా బాధ పడేవారికి మాటలతో ఓదార్చాలి.లేవలేని వారికి విసుక్కోకుండా మందు మంచి నీరు అందివ్వాలి.ఫోన్ చేసి బంధువులతో కాసేపు పిచ్చాపాటీ మాట్లాడాలి.ఏడబ్బు బహుమతులు ఇవ్వని తృప్తి ఓచల్లని పలకరింపు ఇస్తుంది. నిజమే ఇదేచేయూత అంటే🌹
చేయూత! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి