కోరి కొనితెచ్చుకోకు......!. కోరాడ నరసింహా రావు.

 పుడమికి పచ్చదనాన్నిచ్చేది 
ప్రాణికోటికి ఆహ్లాదాన్ని పంచేది 
పంచభూతాలసమన్వయసౌరభమే.....!
అవి వేటి గతులవి తప్పక ప్రవ ర్తిస్తేనే....ఈ అందాలు, ఆనందా లన్నీ ! 
  ఓ మనిషీ... ఇదంతా నీ చేత ల్లోనే...,నీ చేతుల్లోనే ఉంది...!
   నీవీ సృష్ఠి సమస్తానికీ కేంద్రబిందువు వోయ్....!!
ఈ ప్రపంచ సుఖదుఃఖాల కాటా కుమధ్యముళ్ళువినీవే,తూకపు రాయివీ నీవే... !
    నువ్వు సరిగ్గా లేకపోతే.... 
అన్నీ తేడాలేనోయ్ !
 ఈ ప్రకృతిని సమతుల్యంగా సాగనివ్వాల్సిన బాధ్యత నీదేనోయ్... !
ఇప్పటికే చాలా తప్పుడు తూక వలతోనీలాభాల్నిచూసుకుని...  నీ సుఖంకోసం, నీ తాత్కా లిక ఆనందంకోసం... నీ తప్పుడు తూకవలతో ప్రకృతి శక్తులకు భరించలేని, సహించలేనినష్టా న్ని కలిగించావ్  !
ఐనా... నువ్వంటే ఈ ప్రకృతికి ఎంత ప్రేమ.. చూడు... నిన్నెంతగా ఆహ్లాద పరుస్తోందో 
దేనికైనా హద్దు -అదుపు ఉండాలోయ్... !
నువ్వింకా తెలిసుకోలేకపోతే
.....ప్రళయమే.... !!
దాన్ని కోరి కొనితెచ్చుకోకు!
     ******
కామెంట్‌లు