జక్కాపూర్ ఉన్నత పాఠశాలలో "లేత చిగురులు "పుస్తకాల బహుకరణ బండారు జయశ్రీ సంపాదకత్వం లో రూపొందించిన తెలంగాణా బడి పిల్లల హరిత కవితల సంకలనం "లేత చిగురులు " పుస్తక పరిచయ కార్యక్రమము సిద్దిపేట జిల్లా జక్కాపూర్ ఉన్నత పాఠశాలలో  2022,ఆగస్టు 1వ తేదీ సోమవారం రోజున ప్రధానోపాధ్యాయులు రాళ్లబండి పద్మయ్య అధ్యక్షతన నిర్వహించబడింది. హిందీ ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య పుస్తకమును పరిచయం చేసారు. పుస్తకం లో కవితలు వ్రాసిన ఇద్దరు విద్యార్థులు కయ్యాల నిఖిత,బి.శ్రీనిధి లకు సంపాదకులు పంపిన పుస్తకములు, ప్రశంసా పత్రములు ఉపాధ్యాయులు బహుకరించారు. "పట్టుకుచ్చుల పూలు " బతుకమ్మ కవితల సంకలనం లో కవితలు వ్రాసిన ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రశంసా పత్రములు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మ,రాజేందర్,లక్ష్మీ నర్సయ్య,తిరుపతి,గోపీనాథ్ ,మల్లా రెడ్డి. ,చెన్న కేశవ్,దయానంద్,భాగ్యలక్ష్మి, అఖిల పాల్గొన్నారు.


కామెంట్‌లు