తస్మాత్ జాగృత @--కోరాడ నరసింహా రావు !

 ప్రజాప్రభుత్వాలంటే...ప్రజలందరి సంక్షేమమూ కోరాలిగా.... !
రక రకాల పన్నులతో ఇబ్బంది పెట్టటం ధర్మమా.... !?
ఉన్నపన్నులు చాలావనా...ఈ కొత్త పన్నులు... ?!
ప్రజలు తమ వినిమయవస్తువు లను కొనుక్కుంటే, ఆ కొనుక్కు న్నందుకుగానుప్రత్యేకంగామళ్ళీ
పన్నుచెల్లించటమా.... !!
     
 తయారుచేసేఫ్యాక్టరీయాజమా న్యానికియేఇబ్బందీలేదు....,
      అమ్ము కునే వ్యాపారులకూ
బాధలేదు !
ధనికవర్గానికీ ఖాతరులేదు.... 
ఎటొచ్చీసామాన్య,మధ్యతరగతి, వినియోగదారులే... చితికి పోయేది  !
        ముడిసరుకునుఅందించే
వారు , శ్రమించి ఉత్పత్తిచేసే శ్రా మికులు యే కాస్తైనా లబ్ది పొం దు తున్నారా అంటే అదీ లేదు!
బడా వ్యాపారులు, కుహానా పాలకులు లబ్దిపొంద టానికేనా
ఈ టాక్సు లన్నీ.... !
ఎక్కడ ప్రజలుసంపాదనకుమిం చనిఖర్చులతోఇబ్బందులు పడ కుండాబ్రతుకగలుగుతారో.......
అదీ సుపరిపాలన !
 ప్రభుత్వ రాబడికోసం ప్రజలను పీడిస్తూ... నిల్చుంటే పన్ను, కూ చుంటే పన్ను అంటే...., 
   ప్రజలు  ఆ కుర్చీల్లో మిమ్మల్ని
కూచోనివ్వరుమీప్రభుత్వాలను 
నిలబడనివ్వరి !
  తస్మాత్ జాగృత.... !!
     *******
కామెంట్‌లు