స్కూల్! యూనిఫామ్!!;- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
బడిలోన యూనిఫామ్
సమైక్యతకు చిహ్నము
అందరూ ధరించిన
పెంచుతుంది అందము

బేధం తొలగించును
సభ్యత నేర్పించును
అందరూ ఒక్కటని
సందేశమిచ్చును

జాతీయ భావాలు
పెంపొందిస్తుంది
సామరస్యానికీ
బాటలు వేస్తుంది

ఉచితంగా యూనిఫామ్
ప్రభుత అందజేస్తుంది
బూట్లు,సాక్షులు,బెల్ట్స్
కూడా పంచుతుంది

విద్యార్ధీ! యూనిఫామ్
ప్రతిరోజూ వేసుకో!
జాతీయ సమైక్యత
ఆదిలో అలవర్చుకో!


కామెంట్‌లు