కోతిబావ ;- డాక్టర్ గౌరవరాజు సతీష్ కుమార్

 కోతిబావా వచ్చాడూ 
కొంటెపనులూ చేశాడూ 
కొమ్మాకొమ్మా తిరిగాడూ
కొమ్మలన్నీ విరిచాడూ
ఇల్లూఇల్లూ తిరిగాడూ
ఇంటివాళ్ళనూ రక్కాడూ
వాడావాడా తిరిగాడూ
వాడావాళ్ళనూ కొరికాడూ
ఇళ్ళపైకీ ఎక్కాడూ
పెంకులపైనా దూకాడూ
వెంటపడ్డ పిల్లలనూ
వెక్కిరించీ వెళ్ళాడూ !!
***************************
కామెంట్‌లు