ఇచ్చారు ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
అమ్మానాన్నతొ బజారుకెళ్ళి
వస్తువులెన్నో చూశాను
చూసినవన్నీ నచ్చాయి నాకు
నచ్చినవన్నీ కొనమన్నాను
అమ్మానాన్నలు కొన్నారు కొన్ని
కానీ, అన్నీ కావాలన్నాను
గట్టిగ మారాం చేశాను
దొంగ ఏడుపు ఏడ్చాను
అమ్మానాన్నలు చూశారు
నా వీపున రెండూ ఇచ్చారు !!


కామెంట్‌లు