ఏదరికో ఈ నావ; -సాహితీసింధు సరళగున్నాల
తల్లిదండ్రుల ప్రేమలు ధన్యమయ్యి
జన్మనొందితి జీవిగా చలనమంది
నేడు నింటిలో రేపటు నింగిలోకి
చేరబోవును దీనికైచింతయేల

కట్టుబట్టలు లేకుండ కన్నరపుడు
కాటి కేగెడు వేళలో కట్టనేమి
ఖర్చుజేయరు నెవ్వరు కడకునేమి
వెంటరాదయ్య మానవా తంటయేల

కట్టుకున్నట్టి వారలు కడకు వెంట
రారు నీకునీవయ్యి తరలుము   కట్టె 
కాలిన పిదప బూడిదన్ కడవనుంచి
జనులుజూడగ కన్నీరు కనులజారు

కామెంట్‌లు