సుప్రభాత కవిత ; -బృంద
ఎదురు చూసిన వెలుగుల
ఉదయం..

కొత్తగా అందమైన రెక్కలొచ్చిన 
మది సంతోషం.

వరంగా దొరికిన  జన్మకు
ప్రతిక్షణం అపురూపం.

ఎదురుచూసిన కనులకు
కలల సాకారం..

రేపటి తీపిలో ఈనాటి
క్షణాల మురిపం

సంతోషమే గమ్యం
ఆనందమే  అంతరంగం.

కాలం తెచ్చిన మార్పుల
కోలాహలం...

అంతరంగాల ఆనందగీతం
అందమైన లోకంలోకి పయనం

మధురమైన  ఉదయాన్ని

మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు