మంచి బిడ్డ కావాలి;-- Dr కందేపి రాణీ ప్రసాద్
  బాల్యం అంతా బంగారంగా ఉండాలి
  బాల్యం అంతా అద్భుతం గా ఉండాలి
  బాల్యం అంతా ఆనందం గా ఉండాలి
  బాల్యం అంతా సంతోషం గా ఉండాలి 

 కడుపులో ఉన్నప్పుడు పిండం ఎదుగుదల
 పొట్టలో ఉన్నప్పుడు బరువు పెరుగుదల
 తొమ్మిది నెలలు మంచి ఆహార అరుగుదల
చక్కని వ్యాయామం తో బిడ్డ కదలికలు

అన్నీ బాగుంటేనే ఆరోగ్యమైన బిడ్డ 
ఏది సరిగా లేకున్నా లోపాల బిడ్డే
మేనరికపు వివాహాలు మంచిది కాదు
రక్త సంబంధం ఆరోగ్యానికి చేటు

బ్లడ్ గ్రూప్ లు కలవకున్నా సమస్యే
పెళ్లికి జాతకాలు కాదు చూడాల్సింది
రక్త పరీక్షలు ముందే చేసి చూసుకోవాలి
వైకల్యాలు బిడ్డ పుట్టకుండా చూడాలి

మానసిక సమస్యలు ఎన్నో వస్తున్నాయి
దూరపు సంబంధాలను  పెళ్లి చేసుకోండి
పిల్లలకు జీవిత కాల సమస్యలు తేవద్దు
మతి స్థిమితం లేని బిడ్డల్ని కన వద్దు.

గర్భధారణ సమయంలో ప్రయనాలోడ్డు
ఆకతాయి పనులు చేసి ప్రమాద లోద్దు
మానసిక సంఘర్షణలు పడవద్దు
ఆరోగ్యకర బిడ్డను కానీ పెంచండి

కామెంట్‌లు