స్వాతంత్య్రం ఎందరో త్యాగాలఫలం
మరెందరో తెల్లోడిని ఎదిరించిన సాధించిన స్వప్నం
పరాయిపాలనలో బానిసబతుకు చిత్రానికి స్వేచ్ఛనిచ్చిన సమరం
మన సంపదనంతా దోపిడిచేస్తుంటే
మన రక్తాన్ని వాడు
రాక్షసుడై తాగేస్తుంటే
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదిరించిన ధీరత్వం
మన స్వాతంత్ర్యం
భారతీయులందరిని ఏకంచేసిన మహోద్యమం
సమైక్యతతో సాధించుకున్నది మన స్వాతంత్ర్యం
స్వాతంత్ర్య
పోరాటపటిమను
ప్రతి ఒక్కరూ ఎదనిలుపుకుని జాతిగౌరవం నిలబెడదాం
త్రివర్ణ కేతనమై సాగుదాం
*****************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి