భూమిపై పుట్టిన
చెట్టు ఏం చెప్పింది
స్వార్థం వద్దని!!
భూమిపై పారిన
నది ఏం చెప్పింది
పరులకు ఉపయోగపడమని!!?
భూమిపై పుట్టిన
మనిషి ఏం చెప్పిండు
స్వేచ్ఛగా బతకమని
బానిస గా బ్రతుకొద్దని!!
యుద్ధం అంటూ జరిగితే
అన్నం ముద్ద కోసం కాదు!
యుద్ధం అంటూ జరిగితే
స్వేచ్ఛ స్వాతంత్రం కోసం
యుద్ధం అంటూ జరిగితే
బానిస బ్రతుకు విముక్తి కోసం!!!
అది మహాభారత యుద్ధమైన
భారతదేశ స్వాతంత్ర పోరాటమైన!!?
మనిషి గుండె
లయ తప్పకుండా కొట్టుకుంటుంది
ఇంటింటా జండా
రెపరెపలాడుతూ ఎగురుతుంది!!?
కనులు మూస్తే
స్వాతంత్ర సమరయోధులు!
కనులు తెరిస్తే
స్వాతంత్ర సంబరాలు!!
కనురెప్ప వాల్చని
రక్షణ కోసం దేశ సైనికులు
మీకు సలాం
జాతీయ జెండాకు సలాం!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి