ఇండియా ఈజ్ డైమండ్!!;-సునీతా ప్రతాప్, ఉపాధ్యాయిని,P.S.నందివడ్డెమాన్, నాగర్ కర్నూల్ జిల్లా,బిజ్నాపల్లి మండలం.
పౌరుషం రోషం ఉన్నట్లే
కుడి ఎడమ ఉన్నట్లే
తూర్పు పడమర ఉన్నట్లే
స్వేచ్ఛ బానిసత్వం ఉంటుంది!!

మనల్ని మనం పరిపాలించుకుందాం
మనల్ని మనం గౌరవించుకుందాం
మనల్ని మనం సంతోష పెట్టుకుందాం!!

పగ అసూయ ఉన్నట్లే
ప్రేమ ద్వేషం ఉంటుంది
మనల్ని మనం ప్రేమించుకుందాం
మనందరం కలిసి ఉందాం!!

దుఃఖము సుఖము ఉన్నట్లే
పేదరికము సంపద ఉంటుంది
సంపదల్ని సంపాదించుకుందాం
సంపదలని పంచుకుందాం!!

బలము బలహీనమునట్లే
సంతోషమే సగం బలం
బలాన్ని పెంచుకుందాం
మనల్ని మనం కాపాడుకుందాం!!?

వజ్రోత్సవ స్వాతంత్రం అంటే
సంతోషమే దేశ సంపద కావాలి!!?

దేవుడు మానవుడు ఉన్నట్లే
ఆస్తికవాదం హేతువాదం ఉన్నట్లే
అజ్ఞానము విజ్ఞానము ఉంది

మూఢనమ్మకాలు వదిలేద్దాం
శాస్త్రీయ ఆలోచనలు చేద్దాం

యజ్ఞ యాగాదులు యోగాలు చేసినట్లే
శాస్త్రీయ సాంకేతిక యుగంలో
విజ్ఞాన శాస్త్రాన్ని ఆజ్ఞాపిద్దాం
ఆధునికంగా సౌకర్యంగా జీవిద్దాం!!?

జాతీయ జెండాను ఎగిరేద్దాం
ఇండియాను డైమండ్ చేద్దాం!!?

On the occasion of Diamond jubilee celebrations of Independence

కామెంట్‌లు