బ్రహ్మ, నారద సంవాదంలో.....
*యజ్ఞ భాగం శివునకు లేదు - అంబ కోపం - దక్షుని శివ నింద - సతీదేవి ప్రాణ త్యాగ నిర్ణయం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*తన పరివారం తో బయలు దేరిన సతీదేవి, దేదీప్యమానంగా, సర్వాలంకారంగా, వెలిగిపోతున్న దక్షుని భవనము చేరుకుంది. ఆ భవనం అనేక సంపదలతో , ఆశ్చర్యాన్ని కలిగించే వస్తువులతో నిండి వుంది. అటువంటి భవన ద్వారం వద్దకు చేరుకున్న సతీదేవిని చూసిన కన్నతల్లి అయిన అసిక్ని / వీరిణి, సతీదేవి చెల్లెళ్ళు ఆమెకు ఎదురు వచ్చి సకల మర్యాదలతో భవనం లోకి, యాగ శాలలోకి తీసుకుని వెళతారు. యాగాశాలలో వున్న, విష్ణుమూర్తి, బ్రహ్మ, మిగిలిన దేవ, రుషి సమూహమును చూచి, తన భర్త అయిన శివ భగవానుని కి భాగం లేకపోవడం బాధకలిగించగా, తన తండ్రి అయిన దక్షుని కారణం అడుగుతూ....*
*"ప్రజాపతీ! నా భర్త అయిన పరమశివుడు, సర్వమంగళుడు, యజ్ఞ కారకుడు, యజ్ఞ భోక్త, యజ్ఞ కర్త, యజ్ఞ ఫలము, ఇచ్చేవాడు కదా!. సర్వలోక పూజ్యడు కదా! ఆయన స్మరణ చేత సమస్తమూ సఫలము అవుతుంది కదా! శివ ధ్యానము జరగని, శివ భాగము లేని యజ్ఞము సంపూర్ణము అవ్వదు. ఇంతటి స్వామి రాకుండా, లేకుండా యజ్ఞము ఎలా మొదలు పెట్టారు. శివభగవానుడు లేని యజ్ఞము లో విష్ణుమూర్తి మిగిలున దేవతలు ఎలా భాగం అవుతున్నారు" అని దక్షుని అడిగింది దాక్షాయణి.*
*అల్లునితో వైరం వుంది. కూతురి మీద ప్రేమ వుంది, దక్షునికి. అందువల్ల, "అమ్మా, సతీదేవి నన్ను అర్థం చేసుకో. నీ భర్త జడుడు. అమంగళరూపుడు. వేదములచేత బహిష్కరింప బడినవాడు. భూతప్రేత పిశాచాలకు అధిపతి. అటువంటి వానికి యజ్ఞ శాలలో ఏమి పని. యజ్ఞ భాగము ఎలా ఇస్తాము. నీవు వచ్చావు కాదా. సంతోషం. నీ భాగం నీవు తీసుకుని నీయింటికి వెళ్ళు. నువు ఎంత అల్లరి చేసి, యాగీ చేసిన ఇక్కడ నిన్ను ఎవరూ పట్టించుకోరు. ఎదో నా తండ్రి బ్రహ్మ చెప్పాడు కనుక నిన్ను ఆ స్మశాన సంచారికి కట్టబెట్టాను. అంత మాత్రాన, శాస్త్ర జ్ఞానములేని, భస్మలేపనము చేసుకునే ఆ రుద్రుని ఇక్కడకు ఎవరూ పిలవరు. యజ్ఞ భాగం దక్కదు." అని చెపుతాడు దక్షుడు.*
*దక్షుడు పలికిన మాటలు విన్న సతీదేవి, క్రోధారుణ నేత్రాలతో చూపరులకు భయమయ కలిగిస్తోంది. దక్షుడు తప్ప అక్కడ వున్న దేవగణములు, విష్ణుమూర్తి తో సహా ఏ క్షణములో ఏమి జరుగుతుందో అని ఎంతో ఆతురతతో ప్రాణాలు ఉగ్గ పట్టుకుని వున్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి