బ్రహ్మ, నారద సంవాదంలో.....
*యజ్ఞ భాగం శివునకు లేదు - అంబ కోపం - దక్షుని శివ నింద - సతీదేవి ప్రాణ త్యాగ నిర్ణయం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*తనతో తన తండ్రి దక్ష ప్రజాపతి అన్న మాటలను విన్న సతీదేవి కోపముతో, ఆవేశముతో ఎర్రబడ్డ కనుదోయితో అక్కడ వున్న తన తండ్రిని, విష్ణుమూర్తితో సహా సకలదేవగణములను చూచి "శివనింద చేసిన వారు, ప్రోత్సహించిన వారు, విన్న వారు, విని వూరకుండిన వారు ఈ ప్రకృతి, సూర్య చంద్రులు వున్నంత వరకు నరక కూపములో పడి వుందురు." అని పలుకుతుంది.
*శ్లోకం:- యో నిందతి మహాదేవం నింద్యమానం శృణోతి వా | తా ఉభౌ నరకం యాతో యావచ్చంద్ర దివాకరౌ ||*
(శి.పు.రు.సం.స.ఖం.29 / 38)
*"శివ భగవానుని నింద విన్న తరువాత నేను జీవించి వుడడం సమంజసము కాదు. యజ్ఞ శాలలోని ఈ అగ్నికి నన్ను నేను అర్పించుకుంటాను. ఇప్పుడు నేను జీవించి వున్నందువల్ల ప్రయోజనము ఏమీ లేదు. శివ భగవానుడు వారించినా కూడా వచ్చి నందుకు పరమేశ్వర నింద వినవలసి వచ్చింది. పరాత్పరుని నిందించిన వాడు ఎంతటి వాడైనా, వెంటనే ధైర్యవంతులు ఎవరైనా ఆ నింద చేసిన వారి నాలుకను పట్టి లాగి తెగ కోయాలి. ఆ విధంగా నాలిక తెగిపడినప్పుడే, నింద చేసిన వానికి మోక్షము కలుగుతుంది. ఇలా నాలిక కోయడానికి అశక్తులు అయిన వారు తమ చెవులు మూసుకుని ఆ ప్రదేశం నుండి వెళ్ళి పోవాలి. ఇలా చేయడం వలన, ఆతడు మంచి మనసు పొంది, దోషము తగలకుండా వుంటాడు." అని దర్మ బద్ధమైన మాటలు చెపుతుంది సతీదేవి.
*"నా తండ్రీ! దక్ష ప్రజాపతి! మాటల మధ్యలో ఏమరపాటుగా నైనా "శివ" అని పలికితే అన్ని పాపములు నశిస్తాయి. మహాశివుడు మంగళకరుడు. అంతటి వానిని అకారణముగా నిందిస్తున్నావు. ఏమీ చేతకానివాడు, చేయలేని వాడు, అంటున్నావు. మహాదేవునికి ప్రియులు, అప్రియులు లేరు. పరమ పవిత్రమైన కీర్తి కల సదాశివుని, బ్రహ్మ మానస పుత్రుడవైన నీవు, నిందిస్తున్నావు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నీవు సరే. విష్ణుమూర్తి, సనకసనందనాదులకు, మహర్షులకు శివ తత్వం గుర్తులేదా! వారెందుకు మౌనంగా వున్నారు. ఏ కోరికలు లేక శ్మశాన విహారం చేసే శివుని పాద ధూళి ముక్తిని ప్రసాదిస్తుంది అని దేవాదులు, వేదవేత్తలు తమ తలమీద వుంచుకుంటారు కదా! పరమాత్ముడు అయిన శివునికి రాగము లేదు, విరాగము లేదు. ఏ కర్మా చేయవలసిన అవసరము నా భర్త అయిన ఆదిదేవునకు లేదు. పెద్దలను, పూజనీయులను నిందించే జన్మ వ్యర్ధము. అలా నిందించే వారి సాంగత్యాన్ని ప్రయత్న పూర్వకంగా వందిలించుకోవాలి. శివుని నింద చేసిన కారణంగా నీవు అనేక బాధలను అనుభవించక తప్పదు. నా ఈ శరీరం నీవు ఇచ్చినది కాబట్టి, నేను కూడా పతితను అయినట్టే. అందుకే ఈ శరీరాన్ని నేను ఇక్కడ ఈ యజ్ఞ స్థలంలో అగ్నికి ఆహుతి చేస్తాను. దేవతలరా! మునీంద్రులారా! మీరు దక్షుని మాటలు విని మిన్న కున్నారు. ఇది మీకు తగదు. మూఢులుగా ప్రవర్తిస్తున్నారు. ఈ కర్మకు మీకు శివ భగవానుని ద్వారా పూర్ణదండన లభిస్తుంది.* మనసులో తన భర్తను కీర్తిస్తోంది, అంబ.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి