*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 066*
 *ఉత్పలమాల:*
*దైవము తల్లి దండ్రి తగు | దాత గురుండు సఖుండు నిన్నేకా*
*భావన సేయుచున్న తరి | పాపములెల్ల మనోవికార దు*
*ర్భావితుఁజేయుచున్నవి కృ | పామతివై ననుగావుమీ జగ*
*త్పావనమూర్తి భద్రగిరి | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: భద్ర్రాద్రిపై కొలువుండి, కరుణా నిధివైన! దశరధరామా!  నీవే నా దేవుడివి, తల్లివి, తండ్రివి, స్నేహితుడివి, తగినంత సాయము చేసేవాడివి, అని నేను భావించి నీ పూజ చేసే టప్పుడు నా మనసులో కలిగే వికారములు నన్ను అలవిగాని పాపాలవైపు లాగుతోంది. నువ్వు ఈ జగత్తునే రక్షించగల పావనమూర్తివి. దయతో నన్ను కాపాడు తండ్రీ! .......అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"నీవే తల్లియు తండ్రియు నీవే నా తోడునీడ నీవే సఖుడవు గురడవు నిజముగ కృష్ణా!" రామదాసు గారి పద్యం చదివేతే, ఈ పద్యం గుర్తుకు వచ్చింది. ఎవరెవరు ఎన్నిసార్లు ఎంత మార్చి చెప్పినా, అందరూ చెప్పేది, అందరిచేత ఆ సర్వాంతర్యామి చెప్పించేది ఒక్కటే, "పరాత్పర పరమేశ్వరుడు" ఒక్కడే అని. ఒక్కడే అయిన ఆ అనందకారకుడు, ఆనందనిలయం లో విహరించేవాడు అయిన సదాశివ పరబ్రహ్మ తత్వమును ఎల్లప్పుడూ మనసులో నిలుపుకొని వుండే సదవకాశాన్ని, సద్బుద్ధిని మనకు ఇవ్వమని ప్రార్థన చేస్తూ.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు