కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి 139వ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి.
పాఠశాల లైబ్రరీలో ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు,లైబ్రేరియన్ బోయ శేఖర్ గారు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు, సాహితీ వేత్త,గ్రంథాలయోద్యమం నాయకుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు విద్య అభివృద్ధికోసం ఎంతో శ్రమించిన మహానుభావుడు స్వాతంత్య్ర సంగ్రామంలో వందేమాతరం నినాదం బలోపేతానికి కారకుడు అలాంటి గొప్ప మహానుభావుడిని నేడు మనమందరం స్మరించుకోవడం మహపున్య భగ్యమని తెలియజేశారు మరియు ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో మరియు ఇతర పోటీలలో గొలుబొందిన విజేతలకు ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు,మరియు పాఠశాల లైబ్రేరియన్ బోయ శేఖర్ గారు బహుమతులను, ప్రశంస పత్రాలనువిద్యార్థిని,విద్యార్థులకు అందచేశారు.
ఈ కార్యక్రమంలో కె.వి.ఆర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు,లైబ్రేరియన్ బోయ శేఖర్,ఉపాద్యాయులు,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి