హైపో టెన్షన్;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 హైపర్ టెన్షన్ గురించి వివరంగా తెలుసుకున్నాం కదా పనిలో పనిగా హైపో టెన్షన్ గురించి కూడా తెలుసుకుందాం. హైపో టెన్షనే కదా ఏం కాదులే అని చాలా మంది పెద్దగా పట్టించుకోరు కానీ హైపర్ టెన్షన్ అనేది ఎంత ప్రమాదకరమో హైపోటెన్షన్ అనేది కూడా అంతే ప్రమాదకరం. అందరికీ జరిగే అనుభవమే అయినా పెద్దగా పట్టించుకోరు. మీరు ఎప్పుడైనా గమనించారా ఎక్కువ సేపు కూర్చుని, లేదా పడుకొని ఉన్నటుండి పైకి  లేయగానే అకస్మాత్తుగా కళ్ళు తిరుగుతాయి. దీనినే పోష్టురల్ హైపోటెన్షన్ (postural hypotension) అని అంటారు. ఇది కొంత సమయం మాత్రమే వుంటుంది తర్వాత మాములై పోతుంది.
ఉపవాసాలు పస్తులు ఉండి, ఆహారం తినని సమయంలో
సాధారణంగా కళ్ళు తిరగడం అనేది సహజం. దానికి కారణం  గ్లూకోస్ లెవెల్స్ తక్కువయిపోవడం, లేదా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం వల్ల కానీ. వయసు పై బడిన వాళ్ళలో  తిన్న కొద్దిసేపటికి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. దీనిని పోస్ట్ ప్రండియల్ హైపొటెన్షన్ (post prandial hypotension) అని అంటారు. ఆహారం తిన్న తర్వాత కూడా ఇలా జరగడానికి కారణం కార్బోహైడ్రేట్స్. అవునండీ ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి త్వరగా డైజెస్ట్ అయిపోతాయి. అందువల్ల బాడీలో శక్తి తగ్గిపోయి ఫైంట్ అయిపోతారు. ముఖ్యంగా ఈ లోబీపీ లక్షణాలను గురించి మనం మాట్లాడుకుంటే కళ్ళు తిరగడం, కళ్ళు బూజర్లు కమ్మడం, నీరసం, వాంతి వస్తునట్లుగా అనిపించడం లాంటివి. దీనికి మెడిసిన్స్ అంటూ ఏమీ లేవు కానీ, కాస్తంత ఉప్పుని ఒక గ్లాసు నీళ్లలో కలిపి వెంటనే తీసుకోమని చెప్తారు డాక్టర్లు.
అంతేకాకుండా కూర్చునేటప్పుడు కాళ్ళని కొంత ఎత్తులో వుంచమని,
ఎక్కువ శాతంలో నీళ్లను కానీ, మజ్జిగను తాగమని, పడుకున్నప్పుడు పిల్లోస్ ని కాళ్ళ కింద ఉంచమని, విశ్రాంతి ఎక్కువగా తీసుకోమని చెప్తుంటారు.
సాధారణంగా కాఫీలు, టీలు తాగొద్దని చెప్తాము కానీ ఈ కండిషన్ లో మాత్రం కాఫీ తాగడం మంచిది. అందులో కెఫిన్ ఉండడం వల్ల బాడీలో సెల్స్ కి యాక్టివేషన్ (neurostimulant) లభిస్తుంది. ఆహారంలో చిటికెడు ఉప్పును ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
హెచ్చరికలు జారీ చేయడం అనేదే నా వంతు అది పాటించడం పాటించకపోవడం అనేది మీ ఇష్టం...
బాధ్యతగా ఈ చిన్ని డాక్టరు చెప్పిన మాటలను బుద్ధిగా వింటారని భావిస్తూ...


కామెంట్‌లు