అమ్మ చెప్పిన పాఠం;--డా.నీలం స్వాతి, చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 పిల్లలందరి మనస్తత్వాన్ని ఒకే గాటన కట్టడానికి వీలు లేదు  ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచిస్తూ ఉంటారు మా పిల్లల్ని తీసుకోండి మా హని తల్లి వాళ్ళ అమ్మ కానీ, నాన్న గాని  ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు  ముద్దుగా వారిస్తే అది కానీ అన్నీ దాచుకొని అమ్మా నాకు ఇన్ని  డబ్బులు ఉన్నాయి, అక్కా చూశావా నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో. నీ దగ్గర ఉన్నాయా అని ఎదురు ప్రశ్న వేస్తోంది. అదే మా ప్రేమను ఉన్నాడు తనకు 50 రూపాయలు ఇచ్చినా, వంద రూపాయలు ఇచ్చినా  ఆ క్షణాన మొత్తం ఖర్చు చేసి తీరవలసిందే. రెండు మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ మామూలే నాన్న  నా దగ్గర డబ్బులు అయిపోయాయి. పాకెట్ మనీ కావాలి అని అడిగితే  నిన్నే కదా ఇచ్చాను  ఇక నా దగ్గర లేవని చీకాకుగా చెబితే  అమ్మ దగ్గరికి వెళ్లి  గారంగా  అమ్మా ఎవరూ డబ్బులు ఇవ్వకపోతే ఎలా నా స్నేహితులంతా ఏమంటారు  పిసినారి అని ఎద్దేవా చేస్తారు.  నాన్న లేవన్నాడు, నువ్వు అన్నా ఇవ్వమ్మా  అంటే ఆమె ఏం చేస్తుంది. నాన్న దగ్గర లేకపోతే నా దగ్గర ఉన్నాయి అనుకుంటున్నావా? నేనేమైనా పెరట్లో చెట్టుకు కాచిన డబ్బులు తీసుకుంటున్నాను అనుకుంటున్నావా?  అనగానే పళ్ళు ఇకిలిస్తూ అంటే చెట్టుకు డబ్బులు వస్తాయి అన్నమాట  అని హాస్యం ఆడతాడు. అక్కడ అమ్మ తెలివి బయటపడాలి  ఏదైనా పిల్లల మనసులో నాటుకొనేలా  చెప్పాలి అంటే ఆ సందర్భాన్ని సృష్టించుకుంటూ వుంటుంది అమ్మ. ఆ సంఘటనలో జరిగిన విషయాన్ని ఆ చిన్న వయసులో వింటే జీవితంలో మరి ఎప్పుడూ  మర్చి పోవడం జరగదు  అమ్మ ఏమని చెబుతుంది  నువ్వు హాస్యాలు ఆడవలసిన అవసరం లేదురా. నిజాన్ని గ్రహించు దానిని అనుసరించు మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించావా? నీ చిన్న బుర్ర తో ఆలోచించు నీకే అర్థమవుతుంది అని చెప్పి దాని వివరాలు తెలియజేస్తే  బాధ్యతగా వ్యవహరిస్తాడు. మన పెరట్లో ములగ చెట్టు ఉంది  అది బాగా కాస్తుంది దాని కాయలతో మనం కూర చేస్తాం మిగిలినవి మన స్నేహితులకు, ప్రక్క వారికి, బంధువులకు ఇస్తూ ఉంటాము మనం ఒక ములక్కాడ బజార్ లో కొనాలంటే ఎంత అవుతుంది. అలాంటి ములక్కాడలు ఈ చెట్టు మనకు ఎన్ని వందలు ఇస్తుంది  అంటే అంత ధనం ఆ చెట్టుకు కాల్చినట్లే కదా దానిని మనం అనుభవిస్తున్నామా లేదా  అలాగే వరి పండిస్తున్నాం  దానికి డబ్బులు వస్తాయి కదా  ఈ చెట్లు పెంచడం వల్ల మనం పీల్చే ప్రాణవాయువుకు ఎంత ఖర్చో తెలుసునా?  కోట్ల రూపాయల విలువ. అంత ఖర్చు చేయడం మన వల్ల అవుతుందా?  మనం విడిచే  బొగ్గుపులుసు వాయువును అది సేకరిస్తోంది కదా  అంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది అన్నమాట. అంత విలువ కలిగిన చెట్టుని మనం పెంచగలిగాము అంటే సమాజ సేవ చేసినట్లే కదా అని మెత్తగా చెబితే తను కూడా ఓ మొక్క నాటడానికి ముందుకు వస్తాడు  అలా సామాజిక ప్రయోజనం కలిగిన పనులను చేయటంలో కూడా పిల్లలకు తల్లి మాత్రమే చెప్పగలదు దానిని బాధ్యతాయుతంగా చేయమనేదే నా కోరిక. చేస్తారు కదూ...?


కామెంట్‌లు