పిల్లలకు పాత తరం వాళ్ళే ఇష్టం;-డా.నీలం స్వాతిచిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నేను ప్రత్యేకంగా ఉమ్మడి కుటుంబాల గురించి ఎందుకు చెబుతున్నానంటే  దానిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాను కనుక.  చిన్నప్పుడు నేను మా అమ్మ నాన్న కన్నా కూడా  అమ్మమ్మలు నాయనమ్మలను బాగా ఇష్టపడే దాన్ని.  ఏ కొద్ది సమయం దొరికినా వారి దగ్గరికి వెళ్లేదానిని రాత్రులు వారి దగ్గర పండుకుంటే నాకు ఆనందంగా అనిపించేది. సుఖానికి అర్థం తెలియని రోజుల్లో కూడా ఆ గొప్ప సుఖాన్ని అనుభవించాను అన్న తృప్తి ఈనాటికీ నాకు వుంది. అందుకే చెప్తున్నాను  మీరు ఆ పద్ధతిని అనుసరించండి చిన్న పాపను గానీ, బాబును గానీ  నిజానికి ఎవరైనా ఇష్టపడతారు. పిల్లలు  అమ్మను నాన్నను కాక  జేజీలను ఇష్టపడతారు.వారు  పక్కన ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది  ఈ బోసి నవ్వులు పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తాయి.  ముసలి వారు పాపల్లాగా కనిపిస్తారు. ఆమెతో ఆడుకుంటూ ఉంటే తమ ఈడు పిల్లలతో ఆడుకుంటూ ఉన్నట్లుగానే  తనకు ఉంటుంది. ఆప్యాయతను ప్రక్కనపెడితే  చిన్న పిల్లలకు కావలసినది ఏమిటి?  కాకమ్మ కబుర్లు ఈ ముసలి వయసులో ఉన్న వారికి కాలక్షేపం కూడా కావాలి. వారికి తెలిసిన భారత రామాయణ కథ లన్నిటిని  ఈ పిల్లలు చేస్తున్నట్లుగానే కల్పించి వారికి ఆ పద్ధతిలో  నచ్చే భాషలో చెబుతుంది. కనక వారి మనసుకు హత్తుకుంటుంది. వారు చేసిన గొప్ప సాహసాలు, బలహీనులను రక్షించడానికి బలవంతులతో వారు చేసిన పోరాటాలు, ఆ కథలు కేవలం స్త్రీలను గురించి వారు పాడిన పాటలు గురించి విని  వారి కోసం పోరాడిన  సాహసవంతుల కథలు  వీరిని ఎంతో ఉత్తేజపరుస్తాయి. ఆ వయసులో వారి మనసుల్లో పడిన ఏ విషయమైనా అది బీజమై పెరిగి ఆ తరువాత  పెద్దదయిన వటవృక్షంగా మారుతుంది. ఆ సాహసం తానే చేయాలనిపిస్తుంది  సమాజానికి మనం ఎందుకు చేయలేము అన్న ఊహతో   వారి జీవితంలో ముందడుగు వేస్తాడు. మరణించిన ముసలమ్మను  మరచిపోవడం  వీరికి చేతకాదు  వారి నామస్మరణ, వారు చెప్పిన మాటలు, వీరికి  ఇచ్చిన సలహాలు జీవితాంతం జ్ఞాపకం ఉంటాయి. అలా జీవితాంతం జ్ఞాపకం ఉండే స్థితి  మన వయసులో వారికి చెప్పగలమా వారి ప్రేమలు ఆప్యాయతలు శాశ్వతం  మనం పెట్టిన ఆహారం కాదు వారికి బలం  పెద్ద వారు చెప్పిన మాటలే వీరికి బలం. వారు ఏ మంచి పని చేయడానికైనా వారి  మూలాలను మర్చిపోకుండా  వారిని బయటకు నెట్టి  వృద్ధాశ్రమాలలో చేరిస్తే రేపు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ భూమ్మీదకు ఎలా వచ్చామో ఎలా వెళ్లిపోతామో తెలియదు.  వచ్చి వెళ్లే లోపు మాత్రమే మనం మంచి పనులు చేసి వెళ్ళిపోవాలి. అప్పుడు మనల్ని కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు మన పిల్లలు. అలా పెంచడానికి ప్రయత్నం చేయండి. 


కామెంట్‌లు