కూలి బతుకు!; -పి భవాని 9వ తరగతి జెడ్ పి హెచ్ ఎస్ కూకట్ పల్లి హైదరాబాద్
 కూలి గొప్పగ ముట్టుతోందని 
నగర మార్గమే సాధనమ్మని 
పల్లె విడిచి పట్నవాసము పల్లె వాసులు పట్ట్నమే గిరి 
ఉన్న ఊరిలో పనులు లేవయ్యా 
కన్నతల్లిని విడిచినామయ 
అమ్మ నాన్నలు దూరమైరి బంధువులందరునిన్ను విడిచిరి 
తిండి కోసమీ తిప్పలు తప్పవు 
నగరంలో మరి పనులు దొరకనా 
కడుపు నిండుగా తిండి దొరికేనా 
ఉండడానికి ఇల్లు దొరికేనా 
రోడ్డు పక్కనే చోటు దొరికేనా 
అమ్మ నాన్నలు గుర్తుకొచ్చి రా 
భార్యాబిడ్డలు గుర్తుకొచ్చి రా ?
అయ్యో! కంటను కన్నీరొ చ్చెనా ?
ఎవరైనా నీ పనులు మెచ్చెనా?
కడుపు కోసమా యింత పరీక్ష 
అయ్యో ఎందుకు నీకి శిక్ష కండ బలమున్నవాడవు మొండితనము పట్టినాడవు 
కలుగును తప్పక నీకు విజయము దైవము తోడగు నీకిది నిజము
       ***
.

కామెంట్‌లు