అమ్మనే నాన్న నేను,
నిను నమ్మను,
నేను నిను అమ్మను,
నేను దగాపడ్డ దౌర్భాగ్యజీవిని,
కానీ అమ్మ దనంలో కమ్మతనాన్ని
తెలుసుకోగలిగితే,
ఈ ప్రపంచాన్నే జయిస్తావు కన్నా.
అమ్మకి ఆశలు లేవు దేనిపైన.
అమ్మకి మోసం తెలీదు ఏ కోసానా.
అమ్మ స్వచ్ఛమైన వినీలగగనం
అంతరంగాల అంతర్ మథనం,
అందుకే అర్థం చేసు కొలేవు,
నీకు ఆకళింపూ కాదు,
సంఘర్షణ,సంకటాల,జలధి
అయినా కరుణామూర్తి నీ అమ్మ.
అందరూ నావారంటుంది,
అందరిలో ఒంటరి,అందుకే అమ్మ,
అందరూ హేళన చేసే బొమ్మ,
గతి తప్పినా నీతి తప్పదు,
మమత జారినా,మానవత్వం
చావనీయదు,
అమ్మ అంటే రెండక్షరాలే,కానీ
అమ్మ అనంతం,మమతల సంద్రం.
======================,
17/ 462,B3, N.V.R. St,
Nehru nagar,
మదనపల్లి (అన్నమయ్య జిల్లా)
పిన్,517325
అమ్మ;- కొప్పరపు తాయారు- ఫోన్,:. 9440460797
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి