ఒకూర్లో ఒక ముసిలోడు వుండేటోడు. వాని దగ్గర కొన్ని కోళ్ళు వుండేవి. ఆ కోళ్ళంటే ముసిలోనికి చానా ఇష్టం. రోజూ తాను తిన్నా తినకపోయినా వాటికి మాత్రం గింజలు వేస్తా, నీళ్ళు పెడతా,
రాత్రిపూట గంపకింద మూసిపెడతా సొంత పిల్లల కన్నా ఎక్కువగా చూసుకునేటోడు. అవి గుడ్లు పెడితే తినకుండా దాండ్ల కిందనే పొదిగేసేటోడు. దాంతో కొద్దిరోజులకల్లా అవి కుప్పలు కుప్పలు అయిపోయినాయి. వాటిని చూసి చానా సంబరపడేవాడు.
అవూరిని ఆనుకొని ఒక అడవి వుంది. ఆ అడవిలో ఒక నక్క వుంది. అది పెద్ద దొంగది. దాని కన్ను ముసిలోని ఇంటి మీద పడింది. రోజూ చీకటి పడగానే సప్పుడు గాకుండా అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి, ఏదో ఒక గంపకింద చేయి పెట్టి, దొరికిన దాన్ని దొరికినట్టు తీసుకోని పోయి గుట్టు చప్పుడు కాకుండా తినేయసాగింది.
ముసిలోడు రోజు రోజుకీ కోళ్ళు తగ్గిపోతావున్న విషయం గమనించినాడు. చానా బాధపడినాడు. ఎట్లాగయినా సరే దొంగను పట్టుకోవాలని కాపు కాసినాడు. కానీ ఆ దొంగనక్క ముసిలోడు మేలుకున్నది గమనించి ఎప్పుడు నిద్రపోతాడా అని ఏదో ఒక చెట్టు దాపున కాపుకాసేది. ఎవరయినా ఎంతసేపని రెప్పవేయకుండా మేలుకోని వుంటారు. ముసిలోడు ఎప్పుడయినా నిద్రనాపుకోలేక అట్లా కండ్లు మూయడం ఆలస్యం నక్క ఛటుక్కున లోపలికి దూరి ఏదో ఒక కోడిని పట్టుకోని లటుక్కున పారిపోయేది.
ఆ దొంగ నక్కకు ఎలా బుద్ధి చెప్పాలా అని ముసిలోడు బాగా ఆలోచించినాడు. ఆఖరికి వానికి ఒక ఉపాయం తట్టింది. అడవిలోనికి పోయి బాగా వెదికి మాంచి గట్టి తుమ్మ బంకను తీసుకోనొచ్చి దాంతో ఒక కోడిని తయారు చేసి దానికంతా కోడి మాదిరే రంగులేసి ఈకలంటించినాడు. ఆరోజు రాత్రి మిగతా కోళ్ళనంతా లోపల దాచిపెట్టేసి ఆ బంక కోడిని మాత్రం ఒక చెట్టుకు గట్టిగా కట్టేసి పైన గంప మూసినాడు.
నక్కకిదంతా తెలీదుగదా... దాంతో చీకటి పడగానే ఎప్పటిలాగానే ఇంటి దగ్గరికి వచ్చింది. ఇంటిముందు గంప కనిపించింది. ముసిలోని కోసం అటూయిటూ చూసింది. యాడా కనబళ్ళేదు. ఇదే సందనుకోని సర్రున లోపలికి దూరి గంప కింద చేయి పెట్టి కోడిని పట్టుకోనింది. అంతే... దాని చేయి కోడికి అట్లాగే అతుక్కోని పోయింది. “ఇదేంది... ఎప్పుడు ఇట్లా జరగలేదే” అని ఆచ్చర్యపోతా విడిపించుకోడానికని రెండో చేయి పెట్టింది. అంతే... అది గూడా అట్లాగే అతుక్కోని పోయింది. ఎంత పీకినా రాలేదు. దాంతో ఇంగ లాభం లేదనుకోని పెరుక్కోవడానికి రెండు కాళ్ళు పెట్టింది. ఇంకేముంది కాళ్ళు గూడా అట్లాగే అతుక్కోని పోయినాయి.
“ఇదేందిరా నాయనా ఇట్లాగయింది. ఈ రోజు పొద్దున్నే ఎవరి మొహం చూసినానో ఏమో” అనుకుంటా దాన్ని చంపాలని మెడ దగ్గర నోరు పెట్టి కొరికింది. అంతే నోరంతా బంకతో అంటుకపోయింది. అరవడానికీ లేదూ, కదలడానికి లేదు. గిలగిల కొట్టుకుంటున్న కొద్దీ బంక మరింత గట్టిగా అంటుకపోసాగింది. ముసిలోడు తలుపు సందులోంచి ఇదంతా చూసి నవ్వుకోని హాయిగా నిద్రపోయినాడు. రాత్రంతా ఆ దొంగనక్క అలాగే కిందామీదా పడి దొర్లసాగింది.
పొద్దున్నే ముసిలోడు మాంచి లావు కట్టె తీసుకోని వచ్చినాడు. వాని చేతిలోని కట్టెను చూసి నక్క అదిరిపోయింది. “దొంగ సచ్చిందానా... నేనెంతో ప్రేమగా నా కన్న పిల్లల్లెక్క పెంచుకుంటావున్న కోళ్ళనే
తింటావా... ఎంత ధైర్యం నీకు” అంటూ దాన్ని కొట్టిన చోట కొట్టకుండా సావగొట్టినాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక అది లబలబలాడసాగింది. ముసిలోడు దాన్ని మెత్తగా తన్నినాక కట్టెతో దాని నోట్లోని జిగురు తీసి "చెప్పు... మళ్ళా వస్తావా... ఇంకోసారి” అన్నాడు.
నక్క “అమ్మా... అబ్బా...” అని మూలుగుతా “లేదు... లేదు... ఇంకెప్పుడూ రాను... నన్ను కన్న మా అమ్మమీద ఒట్టు, నన్ను పెంచిన మా నాయన మీద ఒట్టు, నేను కట్టుకున్న నా పెండ్లాం మీద ఒట్టు, నేను కొలిచే దేవుని మీద ఒట్టు. ఈ ఒక్కసారికి నన్ను వదిలి పెట్టు... ఇంకోసారి ఎప్పుడయినా కనబడితే సావగొట్టు” అంటూ ఒట్లమీద ఒట్లు పెట్టింది. అప్పుడా ముసిలోడు ఏమోలే పాపమని దాన్ని బంకనుంచి తప్పించినాడు. నక్క హమ్మయ్య అనుకుంటా ఆ ముసిలోనికొక దండం పెట్టి అక్కన్నించి పారిపోయింది.
***********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి