ఎవరమ్మ ఉండు (బాలగేయం); రావిపల్లి వాసుదేవరావు-9441713136
మా పెరటితోటలో ఎవరమ్మ ఉండు
పరిమళాలు పంచే పూపొదలు ఉండు

మా ఊరు చెరువులో ఎవరమ్మ ఉండు
ఎరుపురంగుతో ఉన్న కలువపూలుండు

మా ఊరు అడవిలో ఎవరమ్మ ఉండు
మనసుకూ హాయిచ్చే పచ్చదనముండు

మా మావి తోటలో ఎవరమ్మ ఉండు
మధురంగా ఉండేటి మామిళ్ళు ఉండు

మా ఇంటి శాలలో ఎవరమ్మ ఉండు
చక్కని పాడిచ్చే గోమాతలుండు

మా ఊరి బడిలోన ఎవరమ్మ ఉండు
శ్రద్ధగా చదువుకొనే విద్యార్థులుండు
కామెంట్‌లు