మేనత్త మల్లెలం(బాలా గీతం);-గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి.సెల్ 9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
మేం కలకత్తా పిల్లలం
మా మేనత్త మల్లెలం
మెతుకు కోరు వారలం
బతుకు పోరు పోరలం !

మాఈ కలకత్తా నగరం అత్త
మమ్ముల చేరదీసిన మేనత్త
భారత భాగవత రామాయణం
చదివి చెప్పిన గొప్ప సాహితీవేత్త !

శ్రమించి పెంచిన మా మేనత్త
ప్రేమను పంచిన పాల దుత్త
మా అత్త యత్నం కాలేదు రిత్త
పెంచి చూపించను తన సత్తా!

లాలించి పాలించి మము పోషించింది
సత్పౌరులుగా ఎదగాలని ఆశించింది
ఆయుష్మాన్ భవ అని వెంటనే
 దీవించింది
శుభస్య శీఘ్రం జరగాలని తాను భావించింది!

మా అత్త అంటే మాకు పంచ ప్రాణం
ఆమె తొలగించునులే
 మా నిస్త్రాణం
క్రమ పంథాయే ఆమె యొక్క విధానం
సక్రమంగా నేర్చుకుందిలే ఇక అవధానం !

నగరమంతా తిప్పి చూపించింది
సగర సంతని చెప్పి చేపించింది
కావలసిన సరుకులను ఇప్పించింది
వెలసినఇడుములను  తప్పించింది

అత్తే అయ్యింది మాకు అమ్మ
విత్తం అందించిన మా జేజమ్మ
మా మెతుకు కరువును తీర్చింది
మా బతుకు బరువును మార్చింది!

మెండుగా వత్తాసు పలికే అత్త
గుండు గుత్తంగా ఇచ్చులే బత్తా
అడుగేసి చూపిస్తాం మా సత్తా
పడేసి కొలుస్తే మేం జానెడు బెత్త!

ఇటువంటి గుణం ఉన్న అత్తయ్య
ఇకపైన అందరి యొక్క సొత్తయ్య
ఆ అత్త ఒడి మాకెంతో మెత్తనయ్య
ఇక మీముందుకు మేం వత్తమయ్య 


కామెంట్‌లు