సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుక --నరేందర్ దన్నవరం -చరవాణి : 9492002855
వారానికొక్క నూతన అంశముతో
పరివారమైసాగే కవన బృందము
కమ్మని కవనాలతో సోయగము
చూడచక్కని తెలుగు! సున్నితంబు!!

మెదడుకు పదునున్న చాలు
ఛందస్సు వ్యాకరణాల బాధలేదు
యతి ప్రాసల గోలలేదు
చూడచక్కని తెలుగు! సున్నితంబు!!

చూడచక్కని తెలుగు పదజాలం
సున్నితంబు నొలుకు పదవిన్యాసం
ద్వితీయవార్షికోత్సవాన సిగ్గులొలికే
చూడచక్కని తెలుగు! సున్నితంబు!!
 
చక్కని ప్రశంసా పత్రాలు
రాజసం ఒలుకు బిరుదములు 
కవుల కలమునకు తోరణాలు
చూడచక్కని తెలుగు! సున్నితంబు!!

పాల మీగడలకన్నా సున్నితం
కవన ప్రక్రియలందు ఉన్నతం
సునీతమ్మ హృదయవీణ సున్నితం
చూడచక్కని తెలుగు! సున్నితంబు!!

కామెంట్‌లు