భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరిగింది అనుకుంటున్నాం. అంతకుముందు పరాయి పాలనలో ఉన్నప్పుడు జమీందారుల పాలన కొన్నిచోట్ల నిరంకుశంగా జరిగింది. దానికి ప్రత్యేకంగా తెలంగాణ హైదరాబాదును సొంతం చేసుకొని నిజాం రాక్షస పాలన సాగించాడు ప్రజలందరినీ బానిసలుగా చేసి అనేక రకాల పన్నుల పేరుతో వారి ఆస్తిపాస్తులన్నీ హరించే వాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారు స్వార్థపరుల చేతుల నుంచి సామాన్య మానవులను విముక్తులను చేయడానికి అనేక పథకాలు రచించి కొత్త కొత్త చట్టాలను చేసి వారి పీచ మణచడానికి సన్నద్ధమై ఒక్కొక్క ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకుంటూ వచ్చారు. ఈనాడు మనం చూస్తున్న భారతదేశ పటాన్ని ఒక్కటిగా చేసిన మహానుభావుడు పటేల్ జి వారి పేరు ఏ భారతీయుడు మర్చిపోరు మరచిపోలేరు కూడా.
ఆనాటి పాలనను ఆ ప్రాంతంలో ఉన్న ముసలి వారి నుంచి అతి చిన్న పిల్లల వరకు పరదేశి పాలన కన్నా ఘోరంగా నీచంగా ఉందంటూ అసహ్యించుకున్న వారే. ఆ రోజుల్లో ఏ వనరులను పరిపాలకుడు వదలలేదు బ్యాండెడ్ లేబర్ ఆ రోజుల్లోనే వచ్చింది రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప కుటుంబం గడవని స్థితిలో ఉన్న వారినందరినీ ఆ పాలకులు వారి పనులన్నిటిని ఉచితంగా చేయించుకున్నారు. బీదల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు జలగల్లాగా వారి దగ్గరున్న ఉద్యోగస్తులు చేయని దుశ్చర్యలు లేవు. వయసులో ఉన్న ఆడపిల్లలు కనిపిస్తే ఆ బిడ్డ శీలాన్ని కాపాడేవారు మచ్చుక కూడా లేరు. అలాంటి స్థితిలో పటేల్ సాహసించి దేశాన్ని ఒకడిగా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రజలంతా పూర్తిగా సహకరించి కట్టు బానిసత్వం నుంచి బయట పడ్డారు. పెద్ద దిక్కు లేని కుటుంబంలో స్త్రీ పరిస్థితిని పడిన ఆ మిషంబు భంగీ అని తిక్కన కవి మనకు చెప్పింది ఒక మాంసపు ముక్క రోడ్డు మీద పడితే ఎన్ని పక్షులు వచ్చి దానిని తినడానికి ఆరాట పడతాయో అలా చచ్చి పడివున్న పశువులను చూసి ఆకాశంలో ఎగురుతున్న గద్దవచ్చి దాని చర్మాన్ని మాంసాన్ని ఎలా పీక్కొని తింటుందో అంత ఘోరంగా ఈ పరిపాలకులు వ్యవహరించారన్న పోలికతో అద్భుతంగా చదువుతున్న వారి కళ్ల వెంట నీళ్లు వచ్చేలా ఆటవెలదిని రచించి మనముందుంచారు వేమన. అలాంటి దుస్థితికి ఎవరు వెళ్లకండి అని హెచ్చరిక చేయడం ఈ పద్యం వెనుక ఉన్న నీతి. ఎదుటి వారి కష్టం తనకు వస్తే ఎలా బాధ పడతానో అలా ప్రవర్తించమని వారి ఉద్బోధ. ఆ పద్యాన్ని ఒకసారి చదవండి.
"చచ్చిపడిన పశువు చర్మంబు
కండలు
పట్టి పెరకి తినును బరగ గ్రద్ద గ్రద్ద వంటివాడు గజపతి కాడొకో..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి