🙏వందనమ్ము గణాంబ!
పార్వతీ! జగదాంబ!
జీవగణముల జనని!
శ్రీమాతా! శివాని!
( శ్రీమాత పదాలు., శంకర ప్రియ.,)
👌శ్రీ లలితా సహస్ర రహస్య నామ స్తోత్రము నందు..."గణాంబా గుహ్యకారాధ్యా!" అని; గురుదేవుడైన, "హయగ్రీవ స్వామి"వారు.. శ్రీమాతను ప్రస్తుతిoచారు!
🙏శ్రీమాత.. జీవ గణములకు, ప్రమధాది గణములకు తల్లి! గణపతియైన గజముఖునకు తల్లి.. పార్వతీదేవి! ఈ చరాచర ప్రపంచమునకు మాతృదేవత! ఆ లోకైక జననికి.. రెండుచేతులను జోడించి, నమస్కరించు చున్నాను!
"ఓం గణాంబాయై నమః!" (719వ. నామము)
🚩ఉత్పల మాల🚩
🙏జీవగణాంబ వీవె! వరసిద్ధిని గొల్పెడి తల్లి వీవె! నిన్
భావనఁ జేసినంతనె స్వభావమె మంచిగ మారునమ్మ! రా
జీవ ముఖాంబుజా! శరణు! సేవలు నీకు నొనర్చు భాగ్యమున్
నీవె యొసంగు మమ్మ! మది నీవె వసించి "గణాంబ"! సత్కృపన్.
( శ్రీ లలితా సహస్రనామ స్తోత్రపద్య రత్నావళి.. శ్రీ చింతా రామకృష్ణా రావు., )
🙏"శ్రీమాత! జయ మాత!జయ జయ మాత!"
( శ్రీమాత త్రయోదశాక్షర (13) నామ మాలిక., )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి