నవదుర్గా రూపిణి.. శివాని--శంకరప్రియ., శీల.,సంచారవాణి: 99127 67098
   శ్రీమాతా! శివాని!
"నవ దుర్గా" రూపిణి!
     "శైల పుత్రి"వి నీవె!
వృషా రూఢవు నీవె! (1)
      "బ్రహ్మ చారిణి" వీవె!
అక్ష మాలివి నీవె!
     "చంద్ర ఘంట"వు నీవె!
ఆహ్లాదకరి వీవె! (2)
     అల "కూష్మాoడ" వీవె!
భవ తారిణివి నీవె!
     "స్కంద మాత"వు నీవె!
రక్షాకరివి నీవె!(3)
      "కాత్యాయని"వి నీవె!
కామ దాయిని వీవె!
      "కాల రాత్రి"వి నీవె!
సౌఖ్య దాత్రివి నీవె! (4)
 
      "మహా గౌరి"వి నీవే!
సౌభాగ్య దాయినివి!
      "సిద్ధి ధాత్రి"వి నీవె!
కైవల్య దాయినివి! (5)
      "నవ దుర్గా" రూపిణి!
జయము జయము భవాని!
       నారాయణీ! జనని!
శ్రీమాతా! శివాని! (6)
---------------------------------
🕉️శ్రీదుర్గ! జయ దుర్గ! జయ జయ దుర్గ!
     ( శ్రీదుర్గ త్రయోదశాక్షర (13) నామమాలిక., )

కామెంట్‌లు