గణ నాయకుడు "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 🙏గణ నాయకుడ వీవె!
      శుభ దాయకుడ వీవె!
      వరసిద్ధి వినాయక!*
 
          *ఓ విఘ్న రాజ!
     ( విఘ్న రాజ పదాలు పదాలు., శంకరప్రియ.,)
👌శ్రీమహా గణాధిపతి స్వామివారు.. వరసిద్ధి వినాయకుడు! మహాదేవుని, శివుని కుమారుడు! సర్వ శుభంకరుడు!
👌"గణములు" అనగా ఎనభై నాలుగు (84) లక్షల జీవరాశులు! వాటికి అధిపతి! కనుక, "గణ నాయకుడు".. వినాయకుడు! సమస్త ప్రాణికోటికి.. శుభములు, విజయములు.. అనుగ్రహించు వాడు! కనుక, "శుభ దాయకుడు".. వినాయకుడు! 
శ్రీ స్వామివారికి.. భక్తి ప్రపత్తులతో రెండు చేతులను జోడించి నమస్కరించు చున్నాము, మన మంతా!
       "ఓం గం గణపతయే నమః"!
( అష్టాక్షర మహా మంత్రము.,)
         🚩ఉత్పల మాల:
🙏శ్రీగణ నాయకా! శుభద! చెల్వగు చిత్తము తోడ నాదు బా
      గోగులు చూడు మంచు, నెద కోరుచు పూజలు చేయు చుందు, నే 
       నో గిరిజా సుతా! నిను! మహోన్నత దైవమ! వక్ర తుండ! నిన్ 
        నాగపు మోము వేల్పువని నమ్మి, నుతించెద నో గణాధిపా! (1)
       🚩కంద పద్యము:
🙏గణముల కధిపతి! దేవా!
     గుణ గణముల దలప గనక కూరిమి తో, మా
    ప్రణతుల గయికొని గజముఖ!
      ప్రణుతుల విని దయను గనుము వర్ధిలు నటులన్! (2)
(.. శ్రీగణ నాయక ప్రస్తుతి. డా. శాస్త్రుల రఘుపతి., 

కామెంట్‌లు