మూడు నామాలు పెట్టుకుని
ముద్దుగా మెడలో జపమాల వేసికుని
భుజాలకు శంఖు చక్రాలు దిద్దుకుని
ముఖం పై చిరునవ్వు పులుముకుని
ప్రత్యక్ష మవుతారు నాటక రాయళ్ళు
మన అమాయకత్వాన్ని సొమ్ము
చేసుకునే నయవంచకులు
కల్లబొల్లి మాటలతో మాయలో పడేస్తారు
మత్తుగా నవ్విస్తూ ఉన్నది ఊడ్చుకుని పోతారు
పోలీసులకు దొరుకుతారు కటకటాల పాలవుతారు
శిక్ష ముగిసాక బయటకు వస్తారు
మళ్ళీ కొత్త వేషాలు వేసి నయ నాటకానికి తెర దించుతారు.
మోసగాళ్ళని నమ్మి మోసపోకండి
మూఢ నమ్మకాలతో జీవితాలు పాడు చేసుకోకండి. పారా హుషార్!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి