:డా.దాశరథి రంగాచార్య ;-బి. వైష్ణవి యాదవ్9వ తరగతిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూకట్పల్లి
 ఎవరయ్యా! అతడు ఎవరయ్యా!
జనపదం ఆయన పథం మోదుగుపోలు వారి హృది పథం 
చరిత్రను చెరపలేరు అంటాడు 
రానున్న తరాలకు అందిస్తానంటాడు 
వారి నవలలు కావా
 ప్రజా జీవితాలు 
ఎందరో యువకులకు ప్రబోధ గీతాలు! ఎవరయ్యా? అతడు ఎవరయ్యా? సత్యం ఆయన నమ్మిన మార్గం కర్తవ్యానికి నిలువెత్తు దుర్గం 
తెలంగాణమంటే అభిమానం 
తెలంగాణేతరుల పట్ల లేదు దురభిమానం ఆదర్శం, ఆవేశం, అక్షరం నా జీవితం 
బాధ్యత విలువలు గల సమాజానికే అంకితం అన్నది ఇంకెవరయ్య ఆయనే మన దాశరధి రంగాచార్య!కామెంట్‌లు