సుప్రభాత కవిత ; -బృంద
అంబరపు అద్దపు చెక్కిళ్ళ
అద్దిన కుంకుమ వన్నెలు

వెన్నెల వాడల విహరించిన
పాలమబ్బుల మురిపాలు
పొంగిపొర్లి గట్లు తెగిన 
ఆనందాలు

నీలం నిండిన నింగి  
సిగ్గుతోఎరుపెక్కిన బుగ్గల
అందమైన వధువు

అందని ఆనంద శిఖరాలు
అరచేత  అందిన అనుభూతి

విరితోటలో విడిది చేసిన
వసంతం
మదితోటలో విరబూసిన
మమతల  సీమంతం

మనసంతా  వెన్నెల పరచిన
మమతానుబంధం

నింగీ నేల కలిసే
అపురూప సంగమం

శుభోదయవేళ  శుభకరమైన
రవికిరణాల స్పర్శకు
ముకుళించిన హస్తాలతో
నినదించిన హృదయాల

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు