1.వినుకొండలో పుట్టాడు.
కలమును కదిలించాడు.
గబ్బిలాన్ని రచించాడు.
కుల కంపును కడిగాడు.
2.అశుభంగా భావించే
అసహ్యంగా కనిపించే
అసహనం కలిగించే
గబ్బిలాన్ని రచించే.
3.పేదవారి బాధలను
పీడితుల కన్నీరును
బలహీనుల బతుకును
శివునికి వినిపించెను.
4.కులమతాల అంతరాలు
పేద ధనిక వర్గాలు
బానిసత్వ భావాలు
సమాజానికి చీడలు.
5.అట్టడుగు వర్గాలను
అంటరాని వర్ణాలను
మేల్కొల్పగ ఉదయించెను.
కావ్యాలను రచియించెను.
6.దళితజాతి భవితకు
పేదప్రజల బతుకుకు
దారిచూపె మార్పుకు
అభ్యుదయ భావాలకు.
7.శాస్త్రం బ్రాహ్మణులది.
పరిపాలన రాజులది.
వ్యాపారం వైశ్యులది.
కాయకష్టం ఎవడిది?
8.రాతి బొమ్మ వినేనా?
రాతిగుండె కరిగేనా?
నోరైనా విప్పేనా?
జవాబును చెప్పేనా?
9.నవయుగ తెలుగుకవి.
అభ్యుదయ కవనరవి.
కవితల ఊటబావి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి